KCR Kaleshwaram Enquiry Live Updates: కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో బుధవారం ఉదయం 11:30 గంటలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి ఉదయం 8 గంటలకు ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటల రాజేందర్‌ను విచారించిన కమిటీ.. నేడు కేసీఆర్‌ను ప్రశ్నించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హరీష్ రావు, ఈటల ఇచ్చిన సమాచారంతోపాటు మరింత లోతుగా కేసీఆర్‌ను కమిషన్ విచారించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలతో కలిసి కేసీఆర్ విచారణకు రానున్నారు. కేసీఆర్ విచారణకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.









