)
హైదరాబాదులో భారీ వర్షాల నేపథ్యంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు
ఎన్డీఆర్ఎఫ్ ఫోన్ నెం.8333068536, ఐసీసీసీ 8712596106
హైడ్రా ఫోన్ నెం.9154170992, ట్రాఫిక్ 8712660600
సైబరాబాద్ 8500411111, రాచకొండ 8712662999
టీజీఎస్పీడీసీఎల్ ఫోన్ నెం.7901530966
తెలంగాణ ఆర్టీసీ 9444097000
జీహెచ్ఎంసీ ఫోన్ నె.8125971221
తాగునీరు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) 9949930003
జంటనగరాల్లో భారీగా నమోదైన వర్షపాతం వివరాలు
ఖాజాగూడలో 12 సెంటీ మీటర్లు
ఎస్సార్ నగర్‌లో 11
ఖైరతాబాద్‌లో 11
సరూర్‌నగర్‌లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు
అత్యధికంగా
గచ్చిబౌలిలో 12.5 సెం.మీ. వర్షపాతం
శ్రీనగర్ కాలనీలో 11.1
యూసుఫ్ గూడలో 10.4
ఉప్పల్‌లో 10
బంజారాహిల్స్‌లో 9
నాగోల్‌లో 8.8 సెంటీ మీటర్లు
ఎల్బీనగర్‌లో 9.3 సెం.మీ,
గోల్కొండ 7.9,
బోరబండ 7.5 సెం.మీ
ఆలస్యంగా మేల్కొన్న హైదరాబాద్ మేయర్
భారీ వర్షంతో ఆలస్యంగా మేల్కొన్న హైదరాబాద్ మేయర్ రంగంలోకి దిగారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అంబేడ్కర్ నగర్ రోడ్డు నంబర్ 13లో నాలాను పరిశీలించారు. తాజ్ బంజారా నాలా రిటైనింగ్ వాల్ వద్ద నాలా ప్రవాహం పరిశీలించి.. స్థానికులతో మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్‌కి ఫోన్ చేసి రిటైనింగ్ వాల్ కట్టే వరకు హెచ్చరిక బోర్డ్స్.. బారికేట్‌లు పెట్టాలని సూచించారు.
గేట్లు తెరచుకోనున్న హిమాయత్‌సాగర్ ప్రాజెక్టు
భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుంది. నిండుకుండలా మారడంతో హిమాయత్‌సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరవనున్నారు. 1,764 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో అధికారులు గేట్లు తీసి వరద కిందకు వదలనున్నారు. రాత్రి 10 గంటలకు ఒక గేటు ఎత్తి జలమండలి అధికారులు దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.
జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్
హైదరాబాద్ నగరంలో గురువారం, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్‌ఎంసీ స్పందించింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు, హైడ్రా అధికారుల సమన్వయం చేసుకోవాలని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి అలర్ట్
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉండడంతో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.
మంత్రి ఆదేశాలు
హైదరాబాద్ శివారులోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున వరద సహాయ చర్యలు చేపట్టాలని ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించాలని తెలిపారు. రాత్రంతా వర్షం పడే సూచనలు ఉండడంతో ప్రజలెవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. నీళ్లు నిలిచే ప్రాంతాలను మ్యాపింగ్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు.
భారీగా ట్రాఫిక్ జామ్
కుండపోత వర్షానికి హైదరాబాద్‌లో రోడ్లు కిటకిటలాడాయి. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై వరద పోటెత్తడంతో కొన్ని చోట్ల వాహనాల రాకపోకలు ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం ఒక్కసారిగా అందరూ బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. ఈ కారణంగా ఐటీ కారిడార్ మొదలుకుని ఉప్పల్ వరకు భారీ ఎత్తున వాహనాలు స్తంభించిపోయాయి. కిలోమీటర్ ప్రయాణానికి అర్ధ గంట సమయం పడుతుండడంతో వాహనదారులు తీవ్ర అసహనంతో ఉన్నారు
వర్షాలపై తెలంగాణ వాతావరణ శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ఇవే..
The moment of the cloud pic.twitter.com/dSZEBvgNmO
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 7, 2025
intense to very intense spell occur over GHMC areas and up to ORR Region (with 2-5cm/hr pic.twitter.com/FIBenzEhXo
August 7, 2025— Meteorological Centre, Hyderabad (@metcentrehyd)
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో మల్కాజిగిరి, నేరెడ్‌మెట్, మౌలాలి, సైనిక్‌పురి, కాప్రా, కుషాయిగూడ, ఈసీఐఎల్, చర్లపల్లి, నాగారం, రాంపల్లి, బండ్లగూడ, చీర్యాల్, కీసర తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం.
వరదలో కొట్టుకుపోయిన వాహనాలు
హైదరాబాద్‌లో సుమారు గంట నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఉప్పల్, చిలుకానగర్‌లో వరద పోటెత్తింది. న్యూ రాంనగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద తాకిడికి బైకులు కొట్టుకుపోతున్నాయి. నిలిపి ఉంచిన కార్లు వరదలో మునిగిపోయాయి.
వర్షానికి సంబంధించి జీ తెలుగు న్యూస్ ఛానల్‌లో ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ ఇలా..
వర్షాలపై అప్‌డేట్స్ ఇలా..
వర్షాలపై హైడ్రా హెచ్చరిక
కొట్టుకుపోయిన వారాంతపు సంత
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీలో ప్రతి గురువారం నిర్వహించే వారాంతపు సంత కొట్టుకుపోయింది. భారీ వర్షంతో పోటెత్తిన వరదతో సంతలోని కూరగాయలు .. వాహనాలు.. సామగ్రి కొట్టుకుపోయాయి.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
==> సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్, జిన్నారం, ఐడీఎ బొల్లారం, గుమ్మడిదల పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం.
==> హైదరాబాద్‌లోని ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్, బోడుప్పల్, మేడిపల్లి, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షం.
==> హైదరాబాద్‌లోని.. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఓయూ క్యాంపస్ పరిసర ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్.షం ఈ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
==> హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని సంతోశ్‌నగర్, కాంచన్ బాగ్ ప్రాంతాలలో వర్షం. చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, యాకుత్‌పురా, దారుల్‌షిఫా, అలియాబాద్‌లో వర్షం పడుతోంది.
==> హైదరాబాద్ మలక్‌పేట, చాదర్‌ఘాట్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, మీర్‌పేట్, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్ పరిసర ప్రాంతాలలో వర్షం.
పటాన్‌చెరు వైపు కుండపోత
కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, వివేకానంద నగర్, జేఎన్టీయూ, ప్రగతినగర్, వసంత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా వాతావరణం మారిపోయి భారీగా వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల రోడ్ల పై వర్షపు నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Hyderabad Weather Live Updates: వర్షాకాలంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండతో పాటు ఉక్కపోత ఉండగా.. అకస్మాత్తుగా సాయంత్రం సీన్ మారిపోయింది. హైదరాబాద్ మొత్త మేఘావృతమై కుండపోత వర్షం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ పరిసర జిల్లాలతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రానున్న మరో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.