Rain Live Updates: వేసవికాలం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడంతో ఉక్కపోత.. వేడిమితో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వరుణుడు ఊరట అందించాడు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఒక్కసారిగా నగర వాతావరణం మారిపోయి పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కురవడంతో హైదరాబాద్ ఒక్కసారిగా చల్లబడింది. వర్షాలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ ఇలా..
మరో మూడు రోజులు..
తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం తెలంగాణలో కొనసాగుతోంది. దీనివల్ల మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినట్టు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్ మెదక్ జిల్లాల్లో వాతావరణం మారింది. ఉరుముల శబ్దం ఈదురుగాలుల తో కూడిన వర్షం పడుతుంది. అకాల వర్షం పడడం వలన వరి, మిర్చి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.









