Hyderabad And Telangana Rain Live Updates: హైదరాబాద్‌లో శుక్రవారం వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలు హైదరాబాద్‌ను ముంచెత్తుతున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి. వర్షాల ప్రభావంతో నగర ప్రజలతోపాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జిల్లాల్లో రైతులు వర్షంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వరి ధాన్యం నీటిలో తడవడంతోపాటు మామిడికాయలు నేలరాలుతున్నాయి. రైతులకు అకాల వర్షాలు అపార నష్టం కలిగిస్తున్నాయి.
- అకాల వర్షాలు రైతులు, పశువుల కాపరులకు తీరని నష్టం చేస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి చెందాయి.
- హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
- హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని జిల్లాలకు మరో రెండు, మూడు రోజులు వర్ష సూచన ఉంది.









