)
Hyderabad Weather Live Updates: హైదరాబాద్ లో కాసేపు శాంతించిన వరుణుడు మళ్లీ ప్రతాపం చూపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో కుండబోత వర్షం మొదలైంది.
Telangana Weather Live Updates: రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎస్, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం
లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న సీఎం.
అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించిన సీఎం
సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం.
హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని సీఎస్ ను ఆదేశించిన సీఎం
Andhra Pradesh Weather Live Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన హోం మంత్రి అనిత
ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలి : హోం మంత్రి అనిత
కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి అని ఆదేశం
ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు
కోస్తాంధ్ర, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
సహాయక చర్యలకు NDRF, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉంచాలి
మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
పొంగిపొర్లే కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని సూచన
ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు క్రింద, శిధిలావస్థలో ఉన్న వాటి దగ్గర నిలబడరాదు.
Andhra Pradesh Weather Live Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం..
రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం..
ఈనెల 27న తీరం దాటనున్న వాయుగుండం..
తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు..
నేడు రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు
Telangana Weather Live Updates: వికారాబాద్ జిల్లా పరిగిలో కుండపోత భారీ వర్షం...
అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం...
వాగులను తలపిస్తున్న ప్రధాన రహ దారులు...
కొత్తచెరువు ఆలుగు పారడంతో సాయిరాం కాలనీలోకి భారీగా చేరిన వరద నీరు...
పలు కాలనీలలో చేరిన వరదనీరు
ఉదృతంగా ప్రవహిస్తున్న పరిగి పెద్ద వాగు...
పరిగి -వికారాబాద్ మార్గంలో నిలిచిపోయిన రాక పోకలు....
Telangana Weather Live Updates: సంగారెడ్డి జిల్లా
పటాన్ చెరు-శంకర్ పల్లి రోడ్డుపై భారీగా చేరిన వరద
వాహన రాకపోకలకు అంతరాయం
ORR కింద కర్దనూర్ బ్రిడ్జి వద్ద రోడ్డుపై పోటెత్తిన వరద
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
Hyderabad Weather Live Updates: హైదరాబాద్ : ఇవాళ వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలకు పోలీసుల సూచన.
రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలను కోరిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
Telangana Weather Live Updates: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామంలో భారీ వర్షంలో సైతం రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు...
బ్రాహ్మణపల్లి తొర్రూరు గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు వద్ద ఆక్రమంగా కాలువ తవ్వి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆందోళన..
హైడ్రా ఆధికారులు రావడంతో భారీగా మోహరించిన పోలీసులు..
ఆందోళన చేస్తున్న రైతులను, గ్రామస్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
Telangana Weather Live Updates: వికారాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపాతం కారణంగా తక్కువ ప్రాంతాలు జలమయం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నారు.
Rains Live Updates in Andhra Pradesh Telangana: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిర్మల్, నిజమాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక హైదరాబాద్‌లో నాన్ స్టాప్‌గా వర్షం కురుస్తోంది. వర్షాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి. .