)
Jubilee Hills By Election Polling Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌లో ఇప్పటివరకు 47.16 శాతం పోలింగ్ నమోదు అయింది.
Jubilee Hills By Election Polling Live Updates: మధ్యాహ్నం 3 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 39.90% నమోదు
Jubilee Hills By Election Polling Live Updates: జూబ్లీహిల్స్‌లో నాన్ లోకల్స్ ఉండటంపై సీఈవో సీరియస్..
నియోజకవర్గంలోని నాన్‌లోకల్స్‌పై కేసులు నమోదు చేయాలని సీఈవో ఆదేశాలు..
మాక్ పోలింగ్‌లో ఈవీఎంలు మొరాయించాయి..
9 చోట్ల ఈవీఎంలను మార్చాం.. పొలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది..
ఇప్పటి వరకు నాన్ లోకల్స్‌పై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం-సీఈవో సుదర్శన్‌రెడ్డి
Jubilee Hills By Election Polling Live Updates: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతి బూత్‌కు ఎందుకు తిరుగుతున్నారు: బీఆర్ఎస్ అభ్యర్థి సునీత
==> నాన్ లోకల్ వాళ్లకు జూబ్లీహిల్స్‌లో ఏం పని
==> కాంగ్రెస్‌కు ఓటు వేయండి అంటూ ప్రచారం చేస్తున్నారు
==> రౌడీ షీటర్ బాబా ఫసుయుద్దీన్ అంటూ సునీత స్టేట్ మెంట్
==> జూబ్లీహిల్స్ ఎన్నికలు మొత్తం బెదిరించి దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకుంటున్నారు
Jubilee Hills By Election Polling Live Updates: రహమత్ నగర్లోని పోలింగ్ బూత్ వద్ద 165, 166 లో డాగ్స్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు
Jubilee Hills By Election Polling Live Updates: యూసుఫ్ గూడలో సవేర ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. BRS అభ్యర్థి సునీత, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. BRS టేబుల్ లేకుండా 6 కాంగ్రెస్ టేబుల్స్ వేసుకున్నారని సునీత మండిపడ్డారు. ఈ క్రమంలో కార్పొరేటర్ హేమ శ్యామలపైకి కాంగ్రెస్ నాయకులు దూసుకొచ్చారు.
Jubilee Hills By Election Polling Live Updates: జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.2 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ మందకొడిగా సాగుతోంది.
Jubilee Hills By Election Polling Live Updates: జూబ్లీహిల్స్‌లో పోలింగ్ బూత్‌ల వద్ద తిరుగుతున్న నాన్ లోకల్ కాంగ్రెస్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్‌కు రావడంపై ఆగ్రహం.. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారన్న ఈసీ
ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌లపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం
Jubilee Hills By Election Polling Live Updates: ఓటర్ల ఆశీర్వాదం నా కొడుకుకే - కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తల్లి
ఓటర్ల ఆశీర్వాదం తన కొడుకుకే ఉందని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తల్లి అన్నారు. ఓటు వేసేందుకు వెంకటగిరిలోని నాసర్ స్కూల్ వద్దకు కోడలితో కలిసి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని నవీన్ యాదవ్ సతీమణి కోరారు.
Jubilee Hills By Election Polling Live Updates: జూబ్లీహిల్స్ షేక్‌పేట్ డివిజన్ BJYM ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నాయకుల దాడి
పోలింగ్ రోజు బీజేపీ నాయకులు బయట తిరుగొద్దని వార్నింగ్ ఇస్తూ దాడి
కాంగ్రెస్ నాయకుడు సాయినాథ్ అలియాస్ లడ్డూతో పాటు మరో నలుగురు కలిసి దాడి
దాడిలో తీవ్రంగా గాయపడ్డ BJYM ప్రెసిడెంట్ స్వస్తిక్
తనపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నేతలపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన BJYM షేక్‌పేట్ ప్రెసిడెంట్ స్వస్తిక్
దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని BJP డిమాండ్.
Jubilee Hills By Election Polling Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు:
పోలింగ్ బూత్: 105
SPR హిల్స్ స్లమ్
524 Male
562 Female
Total 1086
పోలింగ్ బూత్: 106
SPR హిల్స్ స్లమ్
449 Male
472 Female
Total 926
పోలింగ్ బూత్ :107
వికలాంగుల కాలనీ
479 Male
499 female
Total 981
సెంటర్ ఫోర్ దళిత్ స్టడీస్ పోలింగ్ స్టేషన్లో మూడు పోలింగ్ బూతులు ఉండగా వాటిలో 2993మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 1452 పురుషులు, 1533 మహిళలు ఉన్నారు. సెంటర్ ఫోర్ దళిత్ స్టడీస్ పోలింగ్ స్టేషన్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది.
Jubilee Hills Polling Live Updates: బోరబండ పోలింగ్ బూత్‌లో బీఆర్ఎస్ కార్యకర్తపై బాబా ఫసియుద్దీన్ దాడి
టేబుల్ పెట్టుకోకుండా దౌర్జన్యం చేయటంపై పోలీసుల తీరును ఖండించిన మాగంటి సునీత గోపీనాథ్
అధికార పార్టీకి తొత్తులుగా మారి పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన బెదిరించిన ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరిక
పోలీసులు ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉండి ఎన్నికలను సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత వాళ్లది
కార్యకర్తలు ఎవరు భయపడకుండా ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం అత్యంత కీలకంగా అని చెప్పాలి. 2014లో ఇక్కడ 50.18% శాతం పోలింగ్ నమోదు అయింది. ఆ తర్వాత 2018లో 45.59% శాతమే ఓటింగ్ లో పాల్గొన్నారు. 2023లో 47.58% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2019లో 39.89% శాతం నమోదు అయితే.. 2024లో 45.59% మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. షేక్‌పేట్ పోలింగ్ బూత్ 30లో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో రిజర్వ్ ఈవీఎంలతో పోలింగ్ కొనసాగిస్తున్నారు. శ్రీనగర్‌కాలనీ నార్గార్జున కమ్యూనటీ హాల్‌లో పవర్ కట్‌లో ఓటర్లు ఇబ్బందిపడ్డారు. మరోవైపు సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారు. మొత్తం 4 లక్షల 13 వందల 65 మంది ఓటర్లు 58 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.దాదాపు 5,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. 1,761 మంది హైదరాబాద్ సిటీ పోలీస్ బలగాలతో పాటు, అదనంగా 800 మంది కేంద్ర పోలీస్ బలగాలను రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతోంది.
షేక్ పేట్ లో 70వేల 545 ఓటర్లు...
ఇంటర్నేషనల్ స్కూల్ లో ఒక బూత్ లో EVM పనిచేయడం లేదు...
షేక్ పేట్ డివిజన్ పోలింగ్ బూత్ నెంబర్ 30 లో టెక్నికల్ సమస్య వల్ల ఇంకా ప్రారంభం కానీ పోలింగ్...
చెక్ చేస్తున్న పోలింగ్ అధికారులు...
బొరబండ డివిజన్ బూత్ నంబర్ 337 రాయన్ టెక్నో స్కూల్ దగ్గర కాంగ్రెస్ ప్రచార టి షార్ట్స్ వేసుకొని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
Jubilee Hills Polling Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో డాన్ బాస్కో స్కూల్‌ను తనిఖీ చేసిన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కర్ణన్
Jubilee Hills Polling Live Updates: ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్
ఎల్లారెడ్డి గూడా శ్రీ కృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెంబర్–290లో తన ఓటు హక్కును వినియోగించుకున్న మాగంటి సునీత గోపీనాథ్
జూబ్లీహిల్స్..
ఉదయం 5 గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది..
6 గంటలకు మాక్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభించిన ప్రిసైడింగ్ అధికారులు..
అన్ని పార్టీల ఎజెంట్ల సమక్షంలో మక్ పోలింగ్ పూర్తి..
7 గంటలకు ప్రారంభమైన పోలింగ్
యూసుఫ్ గూడ గవర్నమెంట్ స్కూల్ లోనే పది పోలింగ్ సెంటర్ లు
ఒకే దగ్గర కు రానున్న పదివేల మంది ఓటర్లు
Jubilee Hills Polling Live Updates: షేక్ పేట్ లో 70వేల 545 ఓటర్లు...
ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక బూత్ లో EVM పనిచేయడం లేదు
చెక్ చేస్తున్న పోలింగ్ అధికారులు
Jubilee Hills Polling Live Updates: జూబ్లీహిల్స్..
ఉదయం 5 గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది..
6 గంటలకు మాక్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభించిన ప్రిసైడింగ్ అధికారులు..
అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ పూర్తి
Jubilee Hills Polling Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
Jubilee Hills Polling Live Updates: జూబ్లీహిల్స్‌లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు
==> ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు
==> ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంల ఏర్పాటు
==> జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విధుల్లో 5 వేల మంది పోలీసులు
==> జూబ్లీహిల్స్‌లో 144 సెక్షన్ విధింపు
==> ఇప్పటివరకు 230 మంది రౌడీషీటర్లను బైండోవర్
Jubilee Hills Polling Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి
==> 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు
==> 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద CRPFతో భద్రత
==> ఫిర్యాదుల కోసం 24 గంటల కంట్రోల్ రూమ్
==> 1950 నంబరుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు
==> వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పర్యవేక్షణ
==> మొదటిసారి డ్రోన్లను వినియోగిస్తున్నాం
==> ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
Jubilee Hills By Election 2025 LIVE Updates: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం ముగియగా.. ఓటర్లు నేడు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఈవీఎంలను అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి నవీన్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తంగా 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పోలింగ్‌కు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.