KCR Hot Comments: రజతోత్సవ సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

KCR Hot Comments In Silver Jubilee Speech: రాజకీయ జీవితంలో కీలక మైలురాయి సాధించిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సంచలన ప్రసంగం చేశారు. తెలంగాణ రాజకీయాలు సంక్షోభంలో పడడం.. కాంగ్రెస్‌ పార్టీ అన్నింటా విఫలమైన వేళ.. పార్టీ క్లిష్ట పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రజతోత్సవ సభ వేదికగా కేసీఆర్‌ గర్జించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 27, 2025, 07:51 PM IST
KCR Hot Comments: రజతోత్సవ సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
Live Blog

KCR Sensational Speech: రెండున్నర దశాబ్దాల ప్రత్యేకమైన పోరాటం.. పాలన.. పోరాటంగా సాగిన కేసీఆర్‌ తాను స్థాపించిన బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవం సందర్భంగా సంచలన ప్రసంగం చేశారు. చేసుకుంటోంది. తెలంగాణ రాజకీయాలు సంక్షోభంలో పడడం.. కాంగ్రెస్‌ పార్టీ అన్నింటా విఫలమైన వేళ.. పార్టీ క్లిష్ట పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎల్కతుర్తి వేదికగా గులాబీ బాస్‌ గర్జన చేశారు. రజతోత్సవ ప్రసంగం ఆయన మాటల్లోనే..

27 April, 2025

  • 19:50 PM

    కేసీఆర్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు

    • 'వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య శ్రీని పెట్టాడు.. ఆ పథకం పేదలకు అండగా ఉన్నది. దీంతో నేను ముఖ్యమంత్రి అయ్యాక ఆ పథకం పేరు కూడా మార్చకుండా కొనసాగించా' కేసీఆర్
    • 'మేము జేసీబీలు పెట్టి చెరువుల్లో పూడికలు తీస్తే..  కాంగ్రెస్ పార్టీ హైడ్రా అని వాడి బొంద అని పెట్టి పేదల ఇండ్లు కూలగొడుతున్నారు'
  • 19:48 PM

    బభ్రజమానమ్‌ భజగోవిందం.. అంత బెబ్బే అని బీజేపీపై గులాబీ బాస్‌ కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. 11 సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతున్న నరేంద్ర మోదీ తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చారా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

  • 19:46 PM

    కేసీఆర్‌ వార్నింగ్‌
    మల్ల వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వమేనని కేసీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్న పోలీసులకు సభా వేదిక నుంచి కేసీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 'పోలీసులకు ఎందుకు రాజకీయాలు?' అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఇకపై వేధిస్తే ఊరుకోమని కేసీఆర్‌ హెచ్చరించారు. ఇక ఊరుకునేది లేదని.. తాను రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఆపేతరం ఎవరికీ లేదని తెలిపారు.

  • 19:40 PM

  • 19:38 PM

    కేసీఆర్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు

    • మోగోడని మొలక అలకడానికి పిలిస్తే ఎలకని చూసి ఎల్లెలికల పడ్డాడంట.
    • గోల్‌మాల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదు.
    • ఢిల్లీ నుంచి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చి లేనిపోని హామీలు ఇచ్చారు.
    • చరిత్రలో అన్ని ప్రభుత్వాలు రైతుల నుండి శిస్తు వసూలు చేసినవారే.. కానీ రైతులకు సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ.
    • ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీయే
    • శ్రీరాముడు చెప్పిన "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరీయసీ" మాటలను స్పూర్తిగా తీసుకోని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టా
  • 19:28 PM

    ప్రసంగం ప్రసంగంలో టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్థానంపై కేసీఆర్‌ ప్రసంగం చేయగా.. కొద్దిసేపటికి అసలైన ప్రసంగం ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు.. 18 నెలల పాలన వైఫల్యాలు ప్రస్తావించారు. రైతుబంధు, ఉచిత బస్సు, తాగునీరు, రైతులపై మోసాలు, వరిధాన్యం కొనుగోళ్లు వంటి వాటిపై కేసీఆర్‌ ప్రస్తావిస్తూ సంచలన ప్రసంగం చేశారు.

  • 19:20 PM

    జనఃనీ జన్మభూమిశ్చ
    కేసీఆర్‌ ప్రసంగం ముందు జన్మభూమిపై ప్రసంగం ప్రారంభించారు. జనఃనీ జన్మభూమిశ్చ అని పాట పాడిన అనంతరం 'కన్న తల్లిని, జన్మ భూమిని మించినది మరొకటి ఉండదు.. స్వరాష్ట్రం సాధించాలని.. నేను ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించా' అని కేసీఆర్‌ గుర్తుచేశారు. '25 ఏళ్ల కిందట గులాబీ జెండా ఎగిరింది. ఎంతో మంది అవమానించినా.. ఎందరో ఆటంకాలు సృష్టించినా ముందుకువెళ్లాం' అని కేసీఆర్‌ గుర్తుచేశారు. 'మన ఆకాంక్ష తెలంగాణను సాధించుకున్నాం' అని తెలిపారు.

  • 19:05 PM

  • 18:30 PM

    ఎదురుచూస్తున్న కేసీఆర్‌
    సభ ప్రాంగణం వద్దకు చేరుకున్న కేసీఆర్‌ ప్రసంగానికి సిద్ధమవుతున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎల్కతుర్తికి చేరుకున్న గులాబీ బాస్‌ సభా ఏర్పాట్లు.. వచ్చిన ప్రజలు.. సభ ఎలా జరుగుతుందని నాయకులను అడిగి కేసీఆర్‌ తెలుసుకున్నారు. పోలీసులు అక్కడక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని.. ఇంకా లక్షల సంఖ్యలో ప్రజలు రావాల్సి ఉందని నాయకులు కేసీఆర్‌కు వివరించారు. ఇంకా ప్రజల కోసం ఎదురుచూస్తున్న కేసీఆర్‌... పోలీసుల వ్యవహార శైలిలో మార్పు రాకుంటే ప్రసంగం ప్రారంభించే అవకాశం ఉంది. ప్రసంగంలో పోలీసులపై విరుచుకుపడే అవకాశం ఉంది.

Trending News