Add Zee Business As A Preferred Source
App
Live Now

Khairatabad Ganesh Shobha Yatra 2025 LIVE: ముగిసిన ఖైరతాబాద్ గణేష్‌ నిమజ్జనం.. మొదలైన బాలాపూర్ శోభాయాత్ర

Khairatabad Ganesh 2025 Live Updates: జై బోలో గణేష్‌ మహారాజ్‌కు.. గణపతి బొప్పా మోరియా.. అంటూ హైదరాబాద్ నగరం నేడు మార్ముమోగిపోతుంది. 11 రోజులపాటు పూజలు అందుకున్న గణనాథున్ని నేడు గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. ఖైరతాబాద్ గణేష్‌ శోభాయాత్ర భారీ ఎత్తున సాగుతోంది. బాలాపూర్ లడ్డూ వేలంలో ఎంత ధర పలుకుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Khairatabad Ganesh Shobha Yatra 2025 LIVE: ముగిసిన ఖైరతాబాద్ గణేష్‌ నిమజ్జనం.. మొదలైన బాలాపూర్ శోభాయాత్ర
Image Credit: Khairatabad Ganesh Shoba Yatra 2025 LIVE
06 September 2025 12:57 PM (IST)

హైదరాబాద్ లో మొదలైన శోభాయాత్ర...

హైదరాబాద్ లో మొదలైన శోభాయాత్ర

శోభాయాత్రకు బయలు దేరిన గణనాథులు. 11 రోజుల పూజలు అనంతరం గంగమ్మ ఒడికి చేరేందుకు వినాయకులను నిర్వాహకులు తరలిస్తున్నారు. ఎంజె మార్కెట్ వద్ద భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి భారీ ఏర్పాట్లు. ప్రతి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాగతం పలుకుతున్నారు..

06 September 2025 11:35 AM (IST)

భక్త జన సంద్రంగా మారిన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు.. మధ్యాహ్నం 2 గంటల వరకు...

భక్త జన సంద్రంగా మారిన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు.. మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం పూర్తి కానున్నట్టు అధికారులు తెలిపారు. ఖైరతా బాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి భారీగా తరలివస్తోన్న భక్తులు.. సెక్రటేరియట్ నుంచి ట్యాంక్ బండ్ వైపు మెల్లగా కదులుతున్న గణనాయకుడు. 

06 September 2025 10:58 AM (IST)

Balapur Laddu Auction: ప్రతి ఏటా పెరుగుతూ వెళ్తున్న బాలాపూర్ లడ్డు వేలం పాట ఈ...

Balapur Laddu Auction: ప్రతి ఏటా పెరుగుతూ వెళ్తున్న బాలాపూర్ లడ్డు వేలం పాట ఈ సారి ఎంతవరకు వెళ్తుందనేదానిపై ఉత్కంట నెలకొంది. గతేడాది 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి ఈ లడ్డూు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన దాన్ని ప్రధాన మంత్రికి ఇతర కేంద్ర మంత్రులకు పంచారు. అయితే గతఏడాది లడ్డూ వేలంలో పాల్గొనే వారితో పాటు.. కొత్తగా ఏనిమిది మంది ఈ వేలంలో పాల్గొన్నారు.  బాలాపూర్ లడ్డూను రూ. 35 లక్షలకు దక్కించుకున్న లింగాల దశరథ్ గౌడ్. ఈ సారి 4 లక్షల 99 వేల కంటే అధిక ధరకు అమ్ముడు పోవడం విశేషం.

06 September 2025 10:50 AM (IST)

బాలాపూర్ లడ్డూను రూ. 35 లక్షలకు దక్కించుకున్న లింగాల దశరథ్ గౌడ్.. మరిన్న...

బాలాపూర్ లడ్డూను రూ. 35 లక్షలకు దక్కించుకున్న లింగాల దశరథ్ గౌడ్.. మరిన్న వివరాల కోసం క్లిక్ చేస్తూనే ఉండండి.. 

 

06 September 2025 10:45 AM (IST)

హైదరాబాద్ లో ఖైరతాబాద్ అతిపెద్ద వినాయకుడు తర్వాత లడ్డూ వేలంలో ప్రాచుర్యం...

హైదరాబాద్ లో ఖైరతాబాద్ అతిపెద్ద వినాయకుడు తర్వాత లడ్డూ వేలంలో ప్రాచుర్యం పొందిన బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. భక్తులు ఎంతో ఉత్సహాంగా పాల్గొంటున్నారు. 

06 September 2025 10:42 AM (IST)

సెక్రటేరియేట్ సమీపానికి చేరుకున్న ఖైరతాబాద్ భారీ గణ నాయకుడు.. తండోపతండాలుగా...

సెక్రటేరియేట్ సమీపానికి చేరుకున్న ఖైరతాబాద్ భారీ గణ నాయకుడు.. తండోపతండాలుగా తరలివస్తోన్న భక్త జనం.. ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్న భక్లులు.. 

06 September 2025 10:02 AM (IST)

Khairatabad Ganesh Shobha Yatra 2025 Live Updates: నిమజ్జనం సజావుగా సాగేలా...

Khairatabad Ganesh Shobha Yatra 2025 Live Updates: నిమజ్జనం సజావుగా సాగేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చెందిన జీహెచ్ఎంసీ. 

– పోలీస్ , ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం సాఫీగా జరిగేలా చూస్తున్న జీహెచ్ఎంసీ
– నిమజ్జన పాయింట్ ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా DRF సిబ్బంది, గత ఈతగాళ్ల తో నిరంతరం నిఘా
– నిమజ్జన కార్యక్రమంలో స్వచ్ఛతకు జీహెచ్ఎంసీ ప్రాధాన్యం.
– 15 వేల మంది సానిటేషన్ సిబ్బందితో 24×7 పారిశుద్ధ్య కార్యక్రమాలు.
– గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా కోనసాగుతున్న వినాయకుల నిమజ్జన శోభాయాత్ర

06 September 2025 09:27 AM (IST)

...

06 September 2025 08:47 AM (IST)

Ganesh Idols Immersion Live Updates: సరూర్ నగర్ చెరువు వద్ద యువకుల ఆందోళన.....

Ganesh Idols Immersion Live Updates: సరూర్ నగర్ చెరువు వద్ద యువకుల ఆందోళన.. క్రేన్ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు

క్రేన్ సిబ్బంది వినాయకుని నిమజ్జనం చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా కింద పడ్డ వినాయకుడు

వినాయక నిమజ్జనాలకు ప్రభుత్వం సరైన ఏర్పాటు చేయలేదని ఆందోళనకు దిగిన యువకులు

భారీగా మోహరించిన పోలీసులు

06 September 2025 08:44 AM (IST)

06 September 2025 08:42 AM (IST)

Balapur Ganesh Laddu Acution Live Updates: ప్రతి ఏటా పెరుగుతూ వెళ్తున్న...

Balapur Ganesh Laddu Acution Live Updates: ప్రతి ఏటా పెరుగుతూ వెళ్తున్న బాలాపూర్ లడ్డు వేలం పాట ఈ సారి ఎంతవరకు వెళ్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. గత సంవత్సరం 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలన్ శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. అయితే గతఏడాది లడ్డూ వేలంలో పాల్గొనే వారితో పాటు కొత్తగా ఏనిమిది మంది పాల్గొంటున్నారు.

06 September 2025 08:41 AM (IST)

Balapur Ganesh Laddu Acution Live Updates: బాలాపూర్ లడ్డు వేలం పాటకి సర్వం...

Balapur Ganesh Laddu Acution Live Updates: బాలాపూర్ లడ్డు వేలం పాటకి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో బొజ్జగణపయ్య లడ్డూ వేలం ప్రారంభంకానుంది. ఈసారి బాలాపూర్ లడ్డు ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం ఐదు గంటలకు బాలాపూర్ గణేశుడుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వాహకులు. అనంతరం స్వామివారిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెత్తున్నారు ఉత్సవ సమితి సభ్యులు. తిరిగి గ్రామ బొడ్రాయికి వచ్చిన తర్వాత వేలం పాట మొదలుపెడతారు. 

06 September 2025 08:33 AM (IST)

Ganesh Idols Immersion Live Updates: ఏపీలోని ఏలూరు జిల్లా కైకలూరులో వినాయక...

Ganesh Idols Immersion Live Updates: ఏపీలోని ఏలూరు జిల్లా కైకలూరులో వినాయక చవితి  ఊరేగింపులో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ

==> రాళ్లు కర్రలతో ఇరుపక్షాల దాడి

==> గత మూడు రోజుల క్రితం విగ్రహాల ఊరేగింపు జరుగుతుండగా..  దారి విషయమై  జరిగిన గొడవ నేపథ్యంలో  ఒక వర్గం వారిపై దాడి చేసిన మరో వర్గం

==> నేడు విగ్రహ ఊరేగింపులో  గత మూడు రోజుల క్రితం జరిగిన ఊరేగింపులో దాడి చేసిన వర్గంపై మరో వర్గం దాడి

==> ఇరు వర్గాల  రాళ్లు, కర్రలు పరస్పర దాడితో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

==> సమాచారం అందుకున్న పోలీసులు ఇది వర్గాలను చదరగొట్టి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు

06 September 2025 08:29 AM (IST)

Ganesh Laddu Auction 2025 Live Updates: హైదరాబాద్‌లో గణపతి లడ్డూ వేలంలో...

Ganesh Laddu Auction 2025 Live Updates: హైదరాబాద్‌లో గణపతి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. రాజేంద్రనగర్ సన్ సిటీలోని రిచ్మండ్ విల్లాలో ఏకంగా 2 కోట్ల 32 లక్షలు పలికింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

06 September 2025 08:23 AM (IST)

Khairatabad Ganesh Shoba Yatra 2025 Live Updates: ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్...

Khairatabad Ganesh Shoba Yatra 2025 Live Updates: ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర..

శోభాయాత్ర లో భారీగా పాల్గొన్న భక్తులు..

06 September 2025 08:21 AM (IST)

...

Add Zee News as a Preferred Source

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More