SLBC Tunnel Live Updates: క్షణక్షణం ఉత్కంఠ.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఏం జరుగుతోంది..?

SLBC Tunnel Rescue Operation Live Updates: తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు ప్రాణాలతో తిరిగి వస్తారా..? రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతోంది..? లైవ్ అప్‌డేట్స్ కోస ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Feb 27, 2025, 03:31 PM IST
SLBC Tunnel Live Updates: క్షణక్షణం ఉత్కంఠ.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఏం జరుగుతోంది..?
Live Blog

SLBC Tunnel Rescue Operation Live Updates: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ  ఒకటో సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన 8 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ హై రిస్‌లో కొనసాగుతోంది. టన్నెల్ కుప్పకూలిన ప్రదేశానికి రెస్క్యూ టీమ్ చేరుకోగా.. దాదాపు చివరి 200 మీటర్ల దూరంలో ఉన్నారు. ఇక్కడ భారీగా మట్టి పేరుపోవడం.. వాటర్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సొరంగం ప్రమాదంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు కొనసాగిస్తోంది. సొరంగంలో చిక్కుకున్న జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రలకు చెందిన  కార్మికులు, సిబ్బంది కుటుంబాలతో మాట్లాడుతోంది. సొరంగంలో తవ్వకాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపితే  సొరంగం మళ్లీ  కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తేలికపాటి పరికరాలతో రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరిపించాలని నిర్ణయించింది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి. 

 

27 February, 2025

  • 15:31 PM

    SLBC Tunnel Rescue Live: SLBC టన్నెల్లో చిక్కుకున్న వారికి సంబంధించి బిగ్‌ అప్‌డేట్ వచ్చింది. 8 మంది కార్మికులు చనిపోయారని జేపీ అసోసియేట్స్ యజమాని జై ప్రకాష్ గౌర్ వెల్లడించారు. ఆరు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని.. అయితే ఇవాళ టన్నెల్ చివరి వరకు వెళ్లినా వారి ఆచూకీ లభించలేదని చెప్పారు. బురదలో కూరుకుపోయి చనిపోయి ఉంటారని ఆయన తెలిపారు. వారి మృతదేహాలు బయటకు తీసిన తరువాత ప్రాజెక్ట్ కొనసాగించాలా వద్దా అని మంత్రులతో మాట్లాడుతామన్నారు. 

  • 13:46 PM

Trending News