)
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట్, బాలానగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భారీగా వాహనాలు స్తంభించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.
రానున్న నాలుగు రోజులు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న నాలుగు రోజులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంజాగుట్ట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తోపాటు కూకట్‌పల్లి, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, తార్నాక ప్రాంతాల్లో వర్షం పడింది. రెండు రోజులుగా తీవ్రమైన ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ ప్రజలకు వర్షంతో ఊరట లభించింది.
పాలమూరులో..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. మహబూబ్‌నగర్, మక్తల్, జడ్చర్ల ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో పంటలకు మేలు చేస్తుందని చెబుతున్నారు. గతంలో వరుసగా కొన్ని రోజులు పడిన వర్షంతో పంటలు మునిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వర్షంతో పంటలకు సాగునీళ్లు అందుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నగరవ్యాప్తంగా..
మధ్యాహ్నం శివారు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం సాయంత్రం నగరంలోని అన్ని ప్రాంతాలకు వర్షం వ్యాపించింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, రాంనగర్, గాంధీనగర్, నారాయణగూడ, బషీర్‌బాగ్, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం వ్యాపిస్తోంది.
మునిగిన జాతీయ రహదారి
హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో విజయవాడ వెళ్లే రహదారి పూర్తిగా మునిగిపోయింది. పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. హయత్‌నగర్‌లో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాయి. మోకాళ్ల లోతు నీరు రావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
నగరంలో ఒక్కసారిగా వాతవరణం మారిపోయింది. పూర్తిగా నల్లని మబ్బులతో మెగామృతం అయిన ఆకాశం ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. హయత్‌నగర్, వనస్థలిపురం, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్టు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది,దీనితో రోడ్లపై వెళ్ళే వాహన దారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
హైదరాబాద్ నగరం మొత్తం భారీ వర్షం కురవడంతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలు సరూర్‌నగర్, ఉప్పల్, నారపల్లితోపాటు పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. జిల్లాల్లో వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.
హయత్‌నగర్‌లో భారీగా కురిసిన వర్షానికి కోర్టు ప్రాంగణం తగ్గిపోయింది. హయత్‌నగర్‌లోని కోర్టు ప్రాంగణం పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. కోర్టులోకి వచ్చిన ప్రజలు కోర్టు సిబ్బంది బయటకు వెళ్లడానికి నీటిలో నుంచి బయటకు రావాలంటే ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో నిమిషాల వ్యవధిలోనే రోడ్లపై భారీగా వరద చేరుకుంది. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నగర శివారులోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపుర్‌మెట్, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. సిటీ పరిసర ప్రాంతాల్లో గంటన్నరపాటు భారీ వర్షం పడింది.
హైదరాబాద్ నగరం మొత్తం భారీ వర్షం కురవడంతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలు ఎల్బీనగర్, సరూర్‌నగర్, ఉప్పల్, నారపల్లితోపాటు పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. జిల్లాల్లో వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.
Heavy Rains In Hyderabad: వర్షం అంటేనే భయపడేలా కొన్ని వారాల కిందట వరుణుడు ప్రతాపం చూపించాడు. కొన్నాళ్లు విరామం తీసుకున్న వరుణదేవుడు మళ్లీ హైదరాబాద్‌తోపాటు తెలంగాణపై దంచి కొట్టాడు. నిన్న అక్కడకక్కడ తెలంగాణలో వర్షాలు కురవగా.. గురువారం మాత్రం ఉదయం నుంచి వాతావరణం మారిపోయింది. ఉదయం మేఘావృతం కాగా మధ్యాహ్నానికి వర్షంగా మారిపోయింది. అనంతరం నగరం నడిమధ్యలో కాకుండా శివారు ప్రాంతంల్లో కుండపోత వర్షం పడింది. అంతేకాకుండా పరిసర జిల్లాల్లో కూడా వర్షం మోస్తరు నుంచి భారీగా కురిసింది. ఈ వర్షంతో వాహనదారులు, స్థానికులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి సంబంధించి లైవ్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.