MLC Elections Counting LIVE: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి బూస్ట్.. గెలుపు ఆయనదే

MLC Elections Results Live Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. టీచర్స్, గ్రాడ్యుయేట్ కోటాలో రెండు రాష్ట్రాల్లో ఆరు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. సోమవారం నుంచి కౌంటింగ్ మొదలైంది. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Written by - Ashok Krindinti | Last Updated : Mar 4, 2025, 08:04 PM IST
MLC Elections Counting LIVE: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి బూస్ట్.. గెలుపు ఆయనదే
Live Blog

MLC Elections Counting Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి ఒక గ్రాడ్యుయేట్ స్థానం, కృష్ణా-గుంటూరు జిల్లాల నుంచి మరొకటి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ప్రాంతంలోని ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో సహా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

4 March, 2025

  • 20:04 PM

    MLC Elections Results Live Updates: ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు.. 4th రౌండ్ అనంతరం  ఇలా.. 

    ==> బీజేపీ -   30,961
    ==> కాంగ్రెస్- 25,363
    ==> బీఎస్పీ-    21,248
    ==> బీజేపీ లీడ్- 5,598

     

  • 18:55 PM

    MLC Elections Results Live Updates: ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు.. మూడో రౌండ్ అనంతరం ఇలా.. 

    ==> బీజేపీ - 23,307
    ==> కాంగ్రెస్- 18,812
    ==> బీఎస్పీ- 15,898
    ==> బీజేపీ లీడ్- 4,494

  • 16:14 PM

    MLC Elections Results Live Updates: కరీంనగర్

    ==> పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో రెండో రౌండ్‌లో  కూడా బీజేపీ  హవా

    ==> బీజేపీ అంజిరెడ్డికి వచ్చిన ఓట్లు  14,690

    ==> కాంగ్రెస్ నరేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు  13,198

    ==> బీఎస్పీ  ప్రసన్న హరికృష్ణ  వచ్చిన ఓట్లు 10,746

    ==> రెండో రౌండ్‌లో 1492 లీడ్ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి

  • 15:26 PM

    MLC Elections Results Live Updates: ఏలూరు జిల్లా.. 

    ==> ఉభయగోదావరి జిల్లాల  పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరా భక్తుల రాజశేఖర్  భారీ విజయం

    ==> ఎమ్మెల్సీ అభ్యర్థిగా తను గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు రాజశేఖర్. "మీరందరూ ఏ నమ్మకంతో గెలిపించారో.. కచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఈ అవకాశం తనకు ఇచ్చినందుకు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రభుత్వంతో కలిసి  పట్టభద్రులకు ఏవైతే రావాలసిన హక్కులన్నిటిని కూడా  సాఫల్యం అయ్యేవరకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 

  • 14:41 PM

    MLC Elections Results Live Updates: పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి మొత్తం పోలైన ఓట్లు సుమారు- 2,52,100 (పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి)

    ==> చెల్లుబాటు అయిన ఓట్లు సుమారు- 2,24,000
    ==> చెల్లుబాటు అయిన ఓట్లను కౌంటింగ్ కోసం టేబుల్ పైకి పంపుతున్నారు.
    ==> చెల్లుబాటు కానీ ఓట్లు-28,000
    ==> చెల్లుబాటు కానీ ఓట్లను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

  • 14:35 PM

    MLC Elections Results Live Updates: కరీంనగర్ జిల్లా: 

    ==> పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్లో బీజేపీ 24 ఓట్లతో ముందంజ.

    ==> బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 8717 ఓట్లు 

    ==> కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 8693 ఓట్లు 

    ==> బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 7866 ఓట్లు

  • 14:16 PM

    MLC Elections Results Live Updates: ముగిసిన ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ 

    ==> ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన  పేరాబత్తుల రాజశేఖర్ 77 వేల 461 మెజార్టీతో గెలుపు

    ==> రాజశేఖర్‌కు 1,24,702 ఓట్లు

    ==> సీపీఎం బలపర్చిన పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల రాఘవులకు 47,241 ఓట్లు

    ==> మూడో స్థానంలో మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ తనయుడు  సుందర్‌కు 16,183 ఓట్లు 

    ==> అమలాపురం నుంచి పోటీ చేసిన బండారు రామ్మోహనరావుకు 789 ఓట్లు 

    ==> పోటీ చేసిన మరో 31 మందికి  వెయ్యిలోపు ఓట్లు 
    ==>  చెల్లని ఓట్లు 19,789

  • 12:48 PM

    MLC Elections Results Live Updates: ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై గెలిచారు. ఏడో రౌండ్ ముగిసేసరికి 70వేల ఓట్ల వ్యత్యాసం ఉంది. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇది పూర్తయితే మెజార్టీలో స్వల్ప మార్పులుండొచ్చు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఎన్నికైన విషయం తెలిసిందే.

  • 12:44 PM

    MLC Elections Results Live Updates: కరీంనగర్: పట్టభద్రుల ఎన్నికల లో భాగంగా ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్ల లెక్కింపు 

    ==> ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కానీ  ఓట్లు 

    ==> సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు  

    ==> ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు, విభజన చేయాల్సి ఉంది.

    ==> 21 టేబుళ్లలో  కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ.

  • 21:27 PM

    MLC Elections Results Live Updates: కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించారు. మల్కా కొమురయ్యకు 12,959, వంగ మహేందర్ రెడ్డికి 7,182, అశోక్ కుమార్‌కు 2621, కూర రఘోత్తం రెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. మరోవైపు నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ MLCగా శ్రీపాల్ రెడ్డి (పీఆర్టీయూ) విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఈయన గెలుపొందారు.

  • 21:12 PM

    MLC Elections Results Live Updates:  అధికారంలోకి వచ్చిన తొలిసారి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా తీర్పునివ్వడం సంచలనం రేపుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 20:37 PM

    MLC Elections Results Live Updates: టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య 

    ==> మొదటి ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించాలంటే మరో 375 ఓట్ల కావాలి.

    ==> ఇంకా లెక్కించాల్సినవి మరో 1000 ఓట్లు  ఉన్నాయి.

  • 19:55 PM

    MLC Elections Results Live Updates: ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 

    ==> ఇవాళ రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కౌంటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం 
    ==> 17 రౌండ్లకు గాను 13 రౌండ్లుకు సంబంధించి వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్ల విభజన పూర్తి 
    ==> మొత్తం 2 లక్షల 18 వేల 902 ఓట్లలో వ్యాలిడ్, ఇన్ వ్యాలీడ్ ఓట్లు గుర్తిస్తున్న సిబ్బంది

  • 19:05 PM

    MLC Elections Results Live Updates: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలుపొందారు.

  • 19:02 PM

  • 18:53 PM

     MLC Elections Results Live Updates: గుంటూరు: రెండవ రౌండ్ ఫలితం 

    ==> 28,000 ఓట్ల లెక్కింపు పూర్తి
    ==> చెల్లని ఓట్లు: 3,003
    ==> కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా కి వచ్చిన ఓట్లు: 17,506
    ==> పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు వచ్చిన ఓట్లు: 6,740
    ==> రెండో రౌండ్‌లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఆధిక్యం: 10,766
    ==> రెండు రౌండ్ల తర్వాత మొత్తం 20,746 ఓట్ల ఆధిక్యంలో ఆలపాటి రాజా (9980+10766)

     

  • 18:33 PM

  • 18:23 PM

    MLC Elections Results Live Updates: నల్లగొండ అప్‌డేట్ : 13మంది ఎలిమినేషన్ తరువాత.
    ==> శ్రీపాల్ రెడ్డి -6165
    ==> అలుగుబెల్లి నర్సిరెడ్డి-4946
    ==> హర్షవర్ధన్ రెడ్డి-4596
    ==> పూల రవీందర్-3249
    ==> పులి సరోత్తం రెడ్డి-2394
    ==> సుందర్ రాజు :2141 ఓట్లు ఎలిమినేట్ అయ్యారు.

  • 18:05 PM

    MLC Elections Results Live Updates: కరీంనగర్ జిల్లా 

    ==> గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపులో కొనసాగుతున్న చెల్లని ఓట్లు.. చెల్లిన ఓట్ల విభజన ప్రక్రియ

    ==> అధికారులకు తలనొప్పిగా మారిన చెల్లని ఓట్లు

    ==> చెల్లని ఓటు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులకు-ఏజెంట్ల మధ్య వాగ్వాదం

    ==> ఈ క్రమంలోనే కౌంటింగ్‌కు ఆలస్యమవుతున్నట్టు సమాచారం

    ==> పట్టభద్రులకు అవగాహన లోపంతో అత్యధికంగా నమోదవుతున్న చెల్లని ఓట్లు

    ==> రైతు బంధు రాలేదని కొందరు.. వరస్ట్ ప్రభుత్వం అంటూ మరి కొందరు.. రైట్ గుర్తు పెట్టి కొందరు.. బ్యాలెట్ పేపర్ తిరగేసి అంకెలు వేసిన ఇంకొందరు.. ఇలా అవగాహనా రాహిత్యంతో చెల్లని ఓట్లుగా గ్రాడ్యూయేటర్ల ఓట్లు

    ==> చెల్లని ఓట్లలో 01, 02 అని రాసిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలంటూ ఎన్నికల  అధికారులకు  విన్నవించిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్

  • 17:50 PM

    MLC Elections Results Live Updates: కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్ అప్ డేట్స్

    సాయంత్రం 5:00 గంటలకు 

    28 టేబుళ్లలో మొదటి రౌండ్‌లో 28,312 ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి

    ==> చెల్లుబాటు అయిన ఓట్లు- 25,242
    ==> చెల్లని ఓట్లు-3,070
    ==> అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్(తెలుగుదేశం పార్టీ)- 17,194
    ==> అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు (పీడీఎఫ్ )-7214   
    ==> ప్రధాన అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కేఎస్ లక్ష్మణ రావు మధ్య 9980 ఓట్ల వ్యత్యాసం.

  • 17:43 PM

    MLC Elections Results Live Updates: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నిక కౌంటింగ్.

    మొత్తం ఓట్లు= 20,135 
    (PRTU ) గాదె శ్రీనివాసులు నాయుడు - 7,216,

    (ఏపీటీఎఫ్,కూటమి  మద్దతు ఇచ్చిన అభ్యర్థి) పాకలపాటి రఘు వర్మ- 6851 ఓట్లు

    (యూటీఎఫ్) కె.విజయ గౌరీ  5,811 ఓట్లు

    ప్రధాన అభ్యర్థులు పాకలపాటి రఘువర్మ, గాదె శ్రీనివాసులు మధ్య 365 ఓట్ల వ్యత్యాసం.

    మొదటి ప్రాధాన్యత ఓట్లలో తేలని అభ్యర్థుల విజయం.

    రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్ధం

  • 17:10 PM

    MLC Elections Results Live Updates: వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ ఓట్లు రాకపోవడంతో  రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఒక ఓటు వచ్చిన చలిక చంద్రశేఖర్, 4 ఓట్లు వచ్చిన కంటే సాయన్న, 7 ఓట్లు దక్కించుకున్న బంక రాజు, పురుషోత్తం రెడ్డి 11 ఓట్లు, లింగడి వెంకటేశ్వర్లు 15 ఓట్లు, అర్వ స్వాతి‌ 19, ఏడో అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి 24 ఓట్లు, ఎనిమిదో అభ్యర్థి కైలాసం 26 ఓట్లు, 36 ఓట్లు వచ్చిన తొమ్మిదో అభ్యర్థి తాటికొండ రాజయ్య ఎలిమినేట్ అయ్యారు.

  • 17:01 PM

    MLC Elections Results Live Updates: తెలంగాణలో MLC ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్పీడందుకుంది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గ స్థానాలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కంటిన్యూ అవుతోంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైంది. ఒక్కో టేబుల్ పై వెయ్యి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. 24టేబుల్స్ పై వెయ్యి, మిగిలిన 139 ఓట్లు 25వ టేబుల్ పై లెక్కించనున్నారు సిబ్బంది. అటు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గ స్థానాలకు కూడా కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టారు. 

  • 16:42 PM

    MLC Elections Results Live Updates: ఏపీలో  రెండు గ్రాడ్యుయేట్‌, ఒక ఉపాధ్యాయ MLC స్థానాలకు  జరిగిన ఎన్నిక కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గత నెల 27న  ఎన్నికలు జరిగాయి. రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ నాయకులతోపాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయస్థానంలో ఏపీటీఎఫ్‌ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు స్థానాల్లోనూ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపించింది.

  • 16:40 PM

  • 16:29 PM

    MLC Elections Results Live Updates: ==> వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది..

    ==> మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజ..

    ==> PRTU అభ్యర్థి  శ్రీపాల్ రెడ్డి.. 6035

    ==> యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి.. 4820

    ==> స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్.. 4437

    ==> స్వతంత్ర అభ్యర్థి పూలరవీందర్.. 3115

    ==> బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి.. 2289

    ==> సుందర్ రాజ్ యాదవ్...2040

    ==> చెల్లుబాటు ఐన ఓట్లు 23641
     
    ==> చెల్లని ఓట్లు 494..

    ==> గెలిచేందుకు రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఓట్లు.. 11822 ఓట్లు..
     

Trending News