Add Zee Business As A Preferred Source
App
Live Now

Telangana Budget 2025 LIVE: తెలంగాణ బడ్జెట్‌లో అదిరిపోయే ప్రకటనలు.. ఏ శాఖకు ఎన్ని నిధులంటే..?

Telangana Govt Budget 2025-26 Highlights: 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ లెక్కలు సిద్ధమయ్యాయి. ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు ఎలా ఉండనున్నాయి..? ఏ స్కీమ్‌కు ఎన్ని నిధులు కేటాయించనున్నారు..? లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
Telangana Budget 2025 LIVE: తెలంగాణ బడ్జెట్‌లో అదిరిపోయే ప్రకటనలు.. ఏ శాఖకు ఎన్ని నిధులంటే..?
Image Credit: Telangana Budget 2025 LIVE Updates
19 March 2025 12:56 PM (IST)

Telangana Budget Live Updates: అసెంబ్లీలో ఉదయం 11;14 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:48 గంటలకు ముగిసింది  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రిని ప్రసంగం తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అభినందించారు.

19 March 2025 12:50 PM (IST)

Telangana Budget Live Updates: "భూమి అనేది ఒక స్థిరాస్థి మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. భూమితో ఉన్న అనుబంధం కన్నతల్లితో, సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం. ఒక వ్యక్తి తన భూమిని కోల్పోయినప్పుడు తన అస్తిత్వాన్నే పోగొట్టుకున్నట్లు భావిస్తాడు. అటువంటి, భావుకతతో ముడిపడి ఉన్న అంశంలో, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల సామాన్యులకు తీరని వేదన మిగిలింది. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, ప్రజలు చేసుకున్న ధరఖాస్తులు కూడా పరిష్కరించలేని దుస్థితి అప్పట్లో ఏర్పడింది. వీటి పరిష్కరణను వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉన్న పరిష్కరణ అధికారాన్ని తహసీల్దార్/ఆర్.డి.ఓలకు బదిలీ చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసాం." అని భట్టి విక్రమార్క తెలిపారు.

19 March 2025 12:33 PM (IST)

Telangana Budget Live Updates: "ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకి యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి, గ్రామ సభలలో ధృవీకరించి, సాగుకు యోగ్యంకాని భూమిని గుర్తించడం ద్వారా, ఈ వృధాను అరికట్టాము. రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల (18,000 కోట్లు) రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము." అని భట్టి విక్రమార్క తెలిపారు.

19 March 2025 12:31 PM (IST)

Telangana Budget Live Updates: ఆరు గ్యారంటీల అమలుకు రూ.56,084 కోట్లు

==> ఇందిరమ్మ ఇళ్లకు రూ.12,571 కోట్లు

19 March 2025 12:27 PM (IST)

Telangana Budget Live Updates: "రాష్ట్ర రైతులనుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని (బోనస్) చెల్లిస్తున్నాం. దీని వల్ల రాష్ట్రంలో సన్న రకాల వరిసాగు గణనీయంగా పెరిగింది. గత ఖరీఫ్ తో పోల్చినప్పుడు, సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివరి వడ్లగింది కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం. ఫలితంగా, రైతులకు చక్కని గిట్టుబాటు ధర లభిస్తున్నది. ఖరీఫ్ సీజన్ లో సన్నవడ్లు పండించిన రైతులకు, పన్నెండు వందల ఆరు కోట్ల నలభై నాలుగు లక్షలు (1,206.44 కోట్లు) బోనస్ చెల్లించడం జరిగింది. రైతుల సౌకర్యార్ధం 2024-25 ఖరీఫ్ సీజన్ లో 8,332 దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసాం." అని ఆర్థిక మంత్రి తెలిపారు.

19 March 2025 12:17 PM (IST)

Telangana Budget Live Updates: "రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం అయ్యే రోజే విద్యార్ధులందరికీ పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్ ను అందజేస్తున్నాం. ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరాని అందిస్తున్నాం. త్వరలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు గ్రీన్ విద్యుత్ ని అందిస్తాం." అని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

19 March 2025 12:15 PM (IST)

Telangana Budget Live Updates: "రాష్ట్రంలో మేలు జాతి పాడిపశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్ పల్లి లో ఒక కొత్త ఫ్రోజెన్ సిమన్ బుల్ స్టేషన్ ను ఇరవై ఒక్క కోట్ల ఆరు లక్షల రూపాయల (21.06 కోట్లు) వ్యయంతో నిర్మిస్తున్నాం. దీనిని అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. దీని ద్వారా సంవత్సరానికి సుమారు 10 లక్షల ఫ్రోజెన్ సెమన్ డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుంది. పశు సంవర్ధక శాఖకు ఈ బడ్జెట్ లో 1,674 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము." అని భట్టి విక్రమార్క చెప్పారు.

19 March 2025 12:09 PM (IST)

Telangana Budget Live Updates: "తెలంగాణ అవతరించిన తరువాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కొరకు ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జత చేయలేదు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మేము అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, వారికి సన్నబియ్యం కూడా ఇవ్వాలని నిర్ణయించాం. నూతన రేషన్ కార్డుల జారీ మరియు అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ఈ సంవత్సరం జనవరి 26 నుండి ప్రారంభించాం.పౌర సరఫరాల శాఖకి ఈ బడ్జెట్ లో 5,734 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము." అని భట్టి విక్రమార్క తెలిపారు.

19 March 2025 12:05 PM (IST)

Telangana Budget Live Updates: ఫ్యూచర్ సిటీకి రూ.100 కోట్లు

గ్రామాల్లో వంద శాతం సౌర విద్యుత్‌కు రూ.1500 కోట్లు

19 March 2025 12:04 PM (IST)

Telangana Budget Live Updates: తెలంగాణలో నిరుద్యోగం రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింపు

==> 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

19 March 2025 12:01 PM (IST)

Telangana Budget Live Updates: "ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 2024, మార్చి నెలలో ప్రారంభించి, ఇండ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించాం. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల (4,50,000) ఇండ్లను మంజూరు చేస్తాం." అని భట్టి విక్రమార్క తెలిపారు.

19 March 2025 11:45 AM (IST)

Telangana Budget Live Updates: నీటి పారుదుల శాఖకు 23,373 కోట్లు కేటాయింపు..

==> రోడ్లు భవనాల శాఖకు 5,907 కోట్లు కేటాయింపు..
==> పర్యాటకశాఖ కు 775 కోట్లు కేటాయింపు..

==> క్రీడా శాఖకు 465 కోట్లు కేటాయింపు..

==> ఫారెస్ట్ స్టాండ్ ఎన్విరాన్మెంట్ 1,023 కోట్లు కేటాయింపు..

==> దేవాదాయశాఖకు 190 కోట్లు కేటాయింపు..

==> హోంశాఖకు 10,188 కోట్లు కేటాయింపు..

19 March 2025 11:44 AM (IST)

Telangana Budget Live Updates: ఐటీ శాఖకు 7,704 కోట్లు..

==> వైద్య ఆరోగ్యశాఖకు 12,393 కోట్లు కేటాయింపు..

==> విద్యుత్ శాఖకు 21,221 కోట్లు కేటాయింపు..

==> H సిటి డెవలప్మెంట్‌కు 150 కోట్లు కేటాయింపు..

==> MA & UD శాఖకు 17,677 కోట్లు కేటాయింపు..

19 March 2025 11:42 AM (IST)

Telangana Budget Live Updates: పంచాయతీ రాజ్ శాఖకు రూ.31,605 కోట్లు
==> ఉచిత గ్యాస్‌ సిలిండర్ స్కీమ్‌- రూ.433 కోట్లు
==> 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
==> యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.11,600 కోట్లు
==> బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు, 38 కాలేజీల్లో ప్రారంభం

19 March 2025 11:35 AM (IST)

Telangana Budget Live Updates: పౌరసరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు కేటాయించారు.
==> కార్మికశాఖ- రూ.900 కోట్లు
==> ఎస్సీ సంక్షేమానికి- రూ40,232 కోట్లు
==> ఎస్టీ సంక్షేమానికి- రూ.17,169 కోట్లు
==> బీసీ సంక్షేమానికి- 11,405 కోట్లు
==> చేనేత రంగానికి- రూ.371 కోట్లు
==> మైనార్టీ సంక్షేమ శాఖకు- రూ.3,591 కోట్లు
==> పరిశ్రమల శాఖకు- రూ.3,527 కోట్లు
==> ఐటీ రంగానికి- రూ.774 కోట్లు కేటాయించారు.

19 March 2025 11:33 AM (IST)

Telangana Govt Budget Live Updates: పంచాయతీరాజ్‌ శాఖకు రూ.31,605 కోట్లు కేటాయింపు
==> వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు
==> విద్యాశాఖ- రూ.23,108 కోట్లు
==> మహిళా శిశుసంక్షేమశాఖ- రూ.2,862 కోట్లు
==> పశు సంవర్థకశాఖ- రూ.1,674 కోట్లు

19 March 2025 11:29 AM (IST)

Telangana Govt Budget Live Updates: గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు

==> విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ స్కీమ్

19 March 2025 11:28 AM (IST)

Telangana Govt Budget Live Updates: రాష్ట్ర ప్రగతి కోసం తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక

==> హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్

19 March 2025 11:25 AM (IST)

Telangana Govt Budget Live Updates: ఆరోగ్య శ్రీ పరిధి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

==> కొత్తగా 1835 వైద్య చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేరిక

19 March 2025 11:19 AM (IST)

Telangana Govt Budget Live Updates: ==> రెవెన్యూ వ్యయం 5.2,26,982 

==> మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రతిపాదించారు.

19 March 2025 11:18 AM (IST)

Telangana Govt Budget Live Updates: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ 2025-26 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టారు.

19 March 2025 11:11 AM (IST)

Telangana Govt Budget 2025 Live Updates: శాసనసభలో తెలంగాణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మూడోసారి ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి జోడు గుర్రాలు అని అన్నారు. అంబేద్కర్ సూచించిన నైతిక విలువలు పాటిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. దశాబ్ధకాలం వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయని అన్నారు.

19 March 2025 11:06 AM (IST)

Telangana Govt Budget Live Updates: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను అందించిన ఉపముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.

19 March 2025 10:47 AM (IST)

Telangana Govt Budget Live Updates: 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్లా శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు అందజేశారు.

19 March 2025 10:44 AM (IST)

Telangana Govt Budget Live Updates: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ నినదాలు చేశారు.

19 March 2025 10:34 AM (IST)

19 March 2025 10:21 AM (IST)

Telangana Govt Budget Live Updates: తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉదయం 11 గంటలకు శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

19 March 2025 10:08 AM (IST)

Telangana Govt Budget Live Updates: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

19 March 2025 09:55 AM (IST)

Telangana Govt Budget Live Updates: కొత్తగా నిర్మించే యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ పాఠశాలలకు 11 వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. గ్యారంటీ హామీల అమలు కింద.. వచ్చే ఏడాది రైతుభరోసాకు రూ.15 వేల కోట్లు, 9.69 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.37 వేల 274 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. 

19 March 2025 09:50 AM (IST)

Telangana Govt Budget Live Updates: నేడు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదని తెలుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టె రోజు సభకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

19 March 2025 09:47 AM (IST)

Telangana Govt Budget Live Updates: శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా భట్టి విక్రమార్కకు  శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు అసెంబ్లీ హాల్లో అభినందనలు తెలిపారు.

19 March 2025 09:44 AM (IST)

Telangana Govt Budget Live Updates: బడ్జెట్ ప్రతులతో  అసెంబ్లీకి చేరుకున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఆయనకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసనసభ సెక్రటరీ నరసింహచార్యులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

19 March 2025 08:59 AM (IST)

19 March 2025 08:45 AM (IST)

Telangana Govt Budget Updates: ప్రస్తుతం బడ్జెట్‌ రూ.2.90 లక్షల కోట్లు ఉండగా.. ఈసారి రూ.3 లక్షల కోట్లు దాటనుంది. అయితే ఆదాయం అంచనాల కంటే రూ.50 వేల కోట్లు తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. 

19 March 2025 08:29 AM (IST)

Telangana Govt Budget Updates: ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు అధిక భాగం నిధులు కేటాయించే అవకాశం ఉంది. నీటి పారుదల, వ్యవసాయం, విద్య, ఇంధన శాఖలకు అధిక ప్రాధన్యం ఇవ్వనున్నారు.

19 March 2025 08:00 AM (IST)

Telangana Govt Budget Updates: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మండలి భేటీ కానుంది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.