Add Zee Business As A Preferred Source
App
Live Now

TS Inter Results 2025 Live Updates: తెలంగాణ ఫలితాలు.. విద్యార్థులకు బిగ్ అప్‌డేట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..?

TS Inter Results 2025 Live Updates: తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్ ద్వారా రిజల్ట్స్‌ను ప్రకటించనున్నారు. ఇంటర్ ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
TS Inter Results 2025 Live Updates: తెలంగాణ ఫలితాలు.. విద్యార్థులకు బిగ్ అప్‌డేట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..?
Image Credit: TS Inter Results 2025 Live Updates
22 April 2025 01:13 PM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: ఇంటర్ ఫలితాల్లో ములుగు జిల్లా సత్తా చాటింది. 80.12 శాతంతో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. కామారెడ్డి జిల్లా 54.93 శాతంతో లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

22 April 2025 01:09 PM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది కంటే పెరిగిన పాస్ పర్సంటేజ్ 

==> ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పై చేయి 

==> ఇంటర్ ఫస్టియర్ లో 73 % శాతం అమ్మాయిలు పాస్ 

==> ఇంటర్ సెకండియర్ 77.73 % శాతం అమ్మాయిలు పాస్ 

==> ఇంటర్ సెకండియర్‌లో మొత్తం 66.89 శాతం పాస్ పర్సంటేజ్ 

==> ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం  71.37 శాతం  పాస్ అయ్యారు
 

22 April 2025 12:51 PM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: ఇంటర్ మొదటి రెండవ సంవత్సరాలకు కలిపి 9 లక్షల 97 వేల 12 మంది హాజరయ్యారు..

==> మొదటి సంవత్సరం పాస్ పర్సంటేజ్ 66.89 శాతం.

==> సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్  71.37 శాతం..

==> మొదటి సంవత్సరం బాలికలు పాస్ పర్సంటేజ్  73.83శాతం. 

==> బాయ్స్ పాస్ పర్సంటేజ్ 57.83 శాతం.

==> సెకండ్ ఇయర్ బాలికలు పాస్ పర్సంటేజ్ 74.21 శాతం

==> సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్  57.21 శాతం 

22 April 2025 12:44 PM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: ఇంటర్ పరీక్షల్లో ఫస్టియర్‌లో 66.89 శాతం మంది, సెకండ్ ఇయర్‌లో 71.37 శాతం విద్యార్థులు పాసయ్యారు. మొదటి సంవత్సరంలో 4,88,430 హాజరవ్వగా బాలికలు 72.83, బాలురు 57.83 శాతం, ద్వితీయ సంవత్సరంలో 5,08,582 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా బాలికలు 74.21, బాలురు 57.31 శాతం పాసయ్యారు.

22 April 2025 12:39 PM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: ఫలితాల్లో గతంలో కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరగ్గా.. మరోసారి బాలికలదే హవా కొనసాగింది.

22 April 2025 12:36 PM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: తెలంగాణ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుంచి ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు ఇందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వారం రోజులు గడువు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా పక్కా ప్రణాళికతో ఎక్కడా పొరపాట్లు జరగకుండా వ్యాల్యుయేషన్ జరిగిందని పేర్కొంది.
 

22 April 2025 12:32 PM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అభినందనలు తెలిపారు. 

22 April 2025 12:29 PM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: ఇంటర్ పరీక్షలు మొత్తం 9.97 మంది విద్యార్థులు రాశారు. సెకండియర్‌లో 71.37 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫస్టియర్‌లో 66.89 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

22 April 2025 12:24 PM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేస్తున్నారు. విద్యార్థులు ఫలితాల కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. 
 

22 April 2025 12:15 PM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: ఇంటర్ ఫలితాలను వెల్లడించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్న ప్రభాకర్ వేదికపైకి చేరుకున్నారు.

22 April 2025 12:03 PM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వెల్లడికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మరికాసేట్లోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను ప్రకటించనున్నారు.

22 April 2025 11:55 AM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: విద్యార్థులు tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. TS Inter Results 2025 అనే లింక్‌పై క్లిక్ చేయండి. పరీక్ష సంవత్సరం, స్ట్రీమ్ జనరల్ లేదా వొకేషనల్ ఎంచుకుని.. హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసిన తరువాత రిజల్ట్స్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

22 April 2025 11:44 AM (IST)

tsbie.cgg.gov.in TS Inter Results Live Updates 2025: ఇంటర్ ఫలితాలు వాట్సాప్‌ ద్వారా వెల్లడిపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) క్లారిటీ ఇవ్వలేదు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లు tsbie.cgg.gov.in, results.cgg.gov.in ద్వారా TS Inter Results 2025 ఫలితాలు తెలుసుకోవచ్చు. 

22 April 2025 11:14 AM (IST)

22 April 2025 11:08 AM (IST)

TS Inter Results 2025 LIVE : మరో గంటలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడికానున్నాయి. రిజల్ట్స్‌ కోసం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

22 April 2025 10:57 AM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: ఇంటర్ ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి విద్యా భవన్‌లో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి విడుదల చేయనున్నారు.
 

22 April 2025 10:50 AM (IST)

TS Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: గతేడాది తెలంగాణ ఇంటర్ సెంకడియర్ పరీక్షల్లో 1,94,311 మంది విద్యార్థులు A గ్రేడ్ సాధించారు. 78,003 మంది విద్యార్థులు బి గ్రేడ్, 25,900 మంది విద్యార్థులు సి గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. డి గ్రేడ్‌లో 8,020 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 

22 April 2025 10:28 AM (IST)

Telangana Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: ఇంటర్ విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

==> tsbie.cgg.gov.in
==> results.cgg.gov.in

22 April 2025 10:14 AM (IST)

Telangana Inter Results 2025 Check on tsbie.cgg.gov.in: ఫలితాలకు సంబంధించిన సహాయం కోసం విద్యార్థులు TSBIE హెల్ప్‌లైన్ నంబర్‌ 9240205555 ను సంప్రదించవచ్చు.

22 April 2025 09:34 AM (IST)

How To Check Telangana Inter Results: ఇంటర్ ఫలితాలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
==> 2వ సంవత్సరం చదువుతున్న జనరల్ స్ట్రీమ్ విద్యార్థులు TSGEN2, వృత్తిపరమైన స్ట్రీమ్ విద్యార్థులు TSVOC2, 1వ సంవత్సరం విద్యార్థులు TSGEN1 లేదా TSVOC1  అని టైప్ చేసి 56263 నంబరకు మెసేజ్ పంపాలి. 
==> మెసేజ్ రూపంలో ఫలితాలు మీ నంబరుకు వస్తాయి.

22 April 2025 09:20 AM (IST)

Telangana Inter Results 2025 Live Updates: 2018 నుంచి ఉత్తీర్ణత శాతం ఎలా ఉందంటే..?

==> 2024: 64.19%

==> 2023: 63.49%

==> 2022: 67.16%

==> 2021: 100%

==> 2020: 68.86%

==> 2019: 63.23%

==> 2018: 59.37%
 

22 April 2025 09:04 AM (IST)

Telangana Inter Results 2025 Live Updates: ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35% మార్కులు సాధించాలి. మొత్తం 1,000 మార్కులకు 350 మార్కులు సాధించాలి. అంధులు, చెవిటివారు లేదా మానసిక వికలాంగులు వంటి కొన్ని వైకల్యాలున్న విద్యార్థులు 25 శాతం మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత అవుతారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.

22 April 2025 08:50 AM (IST)

Telangana Inter Results 2025 Live Updates: ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

==> ముందుగా https://tgbie.cgg.gov.in/ లింక్‌పై క్లిక్ చేయండి. 

==> ఫస్టియర్ లేదా సెంకడియర్ ఫలితాల ఆప్షన్‌ను ఎంచుకోండి. 

==> కేటగిరీ, ఎగ్జామినేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

==> రిజల్ట్స్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఫలితాలను సేవ్ చేసి పెట్టుకోండి.

22 April 2025 08:33 AM (IST)

Telangana Inter Results 2025 Live Updates: గతేడాది తెలంగాణ ఇంటర్ ఫలితాలను  ఏప్రిల్ 24న ప్రకటించారు. ఈ ఏడాది రెండు రోజుల ముందే వెల్లడిస్తున్నారు. 2023లో మే 9వ తేదీన, 2022, 2021లో జూన్ 28న ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే.
 

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.