)
Hyderabad Rains Live Updates: కాప్రా సర్కిల్, మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షం..
నాలాలని తలపిస్తున్న రోడ్లు..
తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు, పాదాచారులు..
ఇండ్లకు చేరుసుకునే సమయంలో కురుస్తున్న వర్షం..
గంటసేపటి నుంచి కురుస్తున్న వర్షం..
రోడ్డు దాటాలంటే ఇబ్బందులు పడుతున్న జనాలు..
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు.
చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయని, ట్రాఫిక్ కు అంతరాయం ఉన్నచోట్ల వెంటనే పోలీస్, హైడ్రా, ట్రాఫిక్ విభాగాలు తగిన చర్యలు చేపట్టాలన్నారు.
లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
జీహెచ్ఎంసీ, విద్యుత్తు విభాగాల అధికారులు వర్షం ఎక్కువ కురిసిన ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు
Hyderabad Rains Live News: జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, ఎర్రగడ్డ, అమీర్ పేట్, సికింద్రాబాద్, ఉప్పల్, నాచారం, ఉప్పల్, హబ్సిగూడ, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Hyderabad Rains Live Updates: జూబ్లీహిల్స్, కూకట్పల్లి, గచ్చిబౌలి, టోలిచౌకి, సరూర్ నగర్, సైదాబాద్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, శేరిలింగంపల్లి, మియాపూర్, బండ్లగూడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండడంతో రోడ్లపై చాలా వాహనాలు నిలిచి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
Hyderabad Weather Today Live Updates: తెలంగాణకు మరోసారి వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు గంటల్లో హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరి, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాలలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నిర్మల్‌లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని సూచించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుంభవృష్టి కురుస్తోంది. రాత్రి 9 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షానికి సంబంధించి లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.