TS Eamcet Result 2025 LIVE: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా తెలుసుకోండి

TS Eamcet Result 2025 LIVE Updates: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలను ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు https://eapcet.tgche.ac.in వెబ్‌సైట్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : May 11, 2025, 12:34 PM IST
TS Eamcet Result 2025 LIVE: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా తెలుసుకోండి
Live Blog

TS Eamcet Result 2025 LIVE Updates: తెలంగాణ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్‌సెట్‌ రిజల్ట్స్ నేడు వెల్లడికానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో ఎప్‌సెట్‌ అగ్రికల్చర్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించగా.. 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలును 2,07,190 మంది రాశారు. TG EAPCET 2025 Results కోసం విద్యార్థులు https://eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అదేవిధంగా దరఖాస్తు సమయంలో రిజస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌ కూడా ఫలితాలు నేరుగా రానున్నాయి. మార్కులు, ర్యాంక్‌ మెసేజ్ రూపంలో వస్తాయి. తొలిసారి జేఎన్టీయూ అధికారులు ఇలా మొబైల్‌కు ఫలితాలను పంపిస్తున్నారు. TS EAPCET 2025 Results లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

11 May, 2025

  • 12:33 PM

    TS Eamcet Result 2025 Check on eapcet.tgche.ac.in: ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు, నిర్వాహకులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.వి బాలకిష్టా రెడ్డి, ఎప్‌సెట్‌ 2025 చైర్మన్ ప్రొ.టి.కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ డా.బి.డీన్ కుమార్‌తో పాటు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • 12:32 PM

    TS Eamcet Result 2025 Check on eapcet.tgche.ac.in: ఇంజనీరింగ్ విభాగంలో 2,07,190 విద్యార్థులు హాజరు కాగా, 1,51,779 మంది (73.26%) ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 81,198 విద్యార్థులు హాజరు కాగా, 71,309 (87.82%) మంది ఉత్తీర్ణులయ్యారు.

  • 11:20 AM

    TS Eamcet Result 2025 Check on eapcet.tgche.ac.in: విద్యార్థులు రిజస్టర్డ్ మొబైల్ నంబరుకే నేరుగా ఫలితాలు వస్తున్నాయి. తొలిసారి జేఎన్టీయూ అధికారులు మొబైల్‌కే రిజల్ట్స్ పంపిస్తున్నారు.

  • 11:15 AM

    TS Eamcet Result 2025 Check on eapcet.tgche.ac.in: TG EAPCET 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. జూబ్లీహిల్స్ నివాసంలో ఫలితాలు విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

  • 11:10 AM

    TS Eamcet Result 2025 Check on eapcet.tgche.ac.in: విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కులు, మొత్తం మార్కులు, అర్హత స్టాటస్, ర్యాంక్‌ కనిస్తాయి.

  • 10:49 AM

    TS Eamcet Result 2025 Check on eapcet.tgche.ac.in: ఎప్‌సెట్ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీలను కూడా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో రిజల్ట్స్‌ను ప్రకటించనున్నారు.

  • 10:29 AM

    TS Eamcet Result 2025 Check on eapcet.tgche.ac.in: అప్‌డేట్: TG EAPCET-2025 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11.15 గంటలకు విడుదల చేస్తారని అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్, వ్యవసాయం & ఫార్మసీ విభాగాలకు మార్కులతో పాటు ర్యాంకులు  ప్రకటించనున్నారు.

  • 10:12 AM

  • 10:04 AM

    TS Eamcet Result 2025 Check on eapcet.tgche.ac.in: నేడు ఉదయంలో 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఫలితాలను ప్రకటిస్తారు. అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు.

  • 09:56 AM

    TS Eamcet Result 2025 Check on eapcet.tgche.ac.in: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు ఇలా తెలుసుకోండి. 

    ==> ముందుగా అధికారిక eapcet.tgche.ac.in  వెబ్‌సైట్‌కి వెళ్లండి.

    ==> హోమ్ పేజీలో TG EAMCET ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

    ==> మీ హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. 

    ==> ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

Trending News