TS 10th Class Results 2025 LIVE Updates: విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈసారి GPA విధానానికి స్వస్తి పలికి సబ్జెక్ట్‌ల వారీగా మార్కుల గ్రేడ్స్ ఇవ్వనున్నారు. పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మొత్తం 5,09,403 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 2,650 సెంటర్స్‌లో పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు మూల్యాంకనం చేపట్టారు. మార్కుల కంప్యూటరీకరణ పూర్తి చేసి.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పక్కాగా చెక్ చేసుకుని నేడు ఫలితాలను వెల్లడించనున్నారు. విద్యార్థులు ఫలితాలను తెలుసుకునేందుకు https://results.bse.telangana.gov.in/, https://bse.telangana.gov.in/ వెబ్‌సైట్స్‌ను సందర్శండి. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.









