TS SSC Supplementary Result 2025 Live: విడుదలైన తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు

TS SSC Supplementary Result 2025 Live Updates: తెలంగాణ పదో తరగతికి సంబంధించిన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు కొద్దిసేపట్లో విడుదల కానున్నాయి. పరీక్ష ఫలితాలు ఎలా తెలుసుకోవాలో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులు ఫలితాలు తెలుసుకునే ప్రక్రియ ఇలా ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 27, 2025, 03:34 PM IST
TS SSC Supplementary Result 2025 Live: విడుదలైన తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు
Live Blog

Telangana SSC Advanced Supplementary Examinations 2025: పదో తరగతి విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా తాజాగా వాటికి సంబంధించిన ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. మార్చిలో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్‌ 30వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఉత్తీర్ణత శాతం 92.78 నమోదైంది. జూన్‌ 3 నుంచి జూన్‌ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించి సెకండరీ విద్యా శాఖ అధికారులు వాల్యుయేషన్‌ పూర్తి చేశారు. కొన్ని నిమిషాల్లో అధికారులు పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

27 June, 2025

  • 15:23 PM

    TG SSC ASE 2025 Results: జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 38,741 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో 24,415 మంది (73.35 శాతం) ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌ ఆధారంగా సప్లిమెంటరీ ఫలితాలు చూసుకోవచ్చు.

  • 15:20 PM

    TS SSC Supply Result 2025 LIVE : 

    ==> పదో తరగతి అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలను మొత్తం38,741 మంది విద్యార్థులు రాశారు.
    ==> విడుదలైన పరీక్ష ఫలితాల్లో 73.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
    ==> 27 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందకపోవడంతో వారు వచ్చే ఏడాది మళ్లీ పరీక్షలు రాసుకోవాల్సిందే.

  • 15:10 PM

    పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అధికారులు హైదరాబాద్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు కొన్ని నిమిషాల్లో అందుబాటులోకి రానున్నాయి.

    ఫలితాల లింక్ ఇదిగో..
    https://bse.telangana.gov.in/ASERESJUN25/TGSSCPVTASERESULTS_2025.aspx

    https://bse.telangana.gov.in/ASERESJUN25/TGSSCASEREGRESULTS_2025.aspx

  • 14:23 PM

    పరీక్ష ఫలితాలు తెలుసుకునేందుకు హాల్‌ టికెట్‌ ముందు ఉంచుకోవాలి. హాల్‌ టికెట్‌ నంబర్‌ లేకపోతే వెబ్‌సైట్‌లో చెప్పిన విధంగా చేస్తే మార్కులు తెలుసుకునే అవకాశం ఉంది.

  • 13:55 PM

    అన్ని పత్రాలు సిద్ధం
    పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌తోపాటు మిగతా కోర్సుల్లో చేరేందుకు ముందే పత్రాలు సిద్ధం చేసుకుని ఉండాలి. అన్ని ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుని ఉంటే ఏమాత్రం సమయం వృథా కాకుండా వెంటనే తదుపరి ఉన్నత విద్యను కొనసాగించవచ్చు.

  • 13:40 PM

    ఆందోళన అవవసరం లేదు
    ==> పదో తరగతి తర్వాత ఉన్నత విద్య అభ్యసించడానికి ఈ ఫలితాలు చాలా ముఖ్యం. ఒక సంవత్సరం వృథా కాకుండా సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులు సాధిస్తే భవిష్యత్‌ చదువులు చదివేందుకు అవకాశం ఉంటుంది.

    ==> ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ పరీక్ష ఫలితాల్లోనూ తప్పితే మాత్రం ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. వచ్చే సంవత్సరం పరీక్షలు రాసుకోవచ్చు. ఈ ఏడాది సయమంలో ప్రత్యేక కోర్సులు, లేదంటే ఉన్నత విద్యకు ప్రత్యేకంగా కోచింగ్‌ తీసుకునే సమయం లభిస్తుంది.

  • 13:16 PM

    పరీక్ష ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

    ==> పరీక్ష ఫలితాల కోసం వెబ్‌సైట్‌ bse.telangana.gov.in ను సందర్శించాలి.

    ==> హోం పేజీలో TS SSC ASE Result 2025 అని ఉన్న దానిపై క్లిక్‌ చేయాలి.

    ==> అనంతరం మీ వివరాలతోపాటు లాగిన్‌ వివరాలు నమోదు చేసి సబ్మిట్‌ చేయాలి.

    ==> తర్వాత స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి.

    ==> ఉన్నత చదువు కోసం ఫలితాలకు సంబంధించిన మార్కుల షీట్ ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

    ==> మిగతా వివరాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

Trending News