)
Local body elections schedule released in Telangana: తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,200 సర్పంచ్ స్థానాలకు గాను 37, 440 వార్డులకు తొలిదశలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని మీడియాలో వెల్లడించారు. ముఖ్యంగా ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయని తెలిపారు.
తొలి దశ డిసెంబర్ 11 న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ 14, మూడో దశలో డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. నామినేషన్లను ఎల్లుండి నుంచి స్వీకరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.
మరోవైపు ఇవాల్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. అదే విధంగా ఓటింగ్ జరిగిన రోజేఫలితాలను వెల్లడిస్తామన్నారు. 31 జిల్లాల్లోని 12, 733 పంచాయతీలు, 1,12, 288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు అయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది.
ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే.. సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించామని ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. 37, 440 తొలిదశలో, రెండొ విడతలో4,333 సర్పంచ్ స్థానాలకు, మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36, 452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఒక ప్రకటనలో వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook