)
Crime Latest Telugu News: రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో ఒక గిరిజన యువతి అనుమానాస్పదంగా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీఈడీ చదువుతున్న ఓ యువతి తన ప్రియుడు రసూల్ వల్ల ఈ దారుణానికి పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈనెల 7వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ యువతి సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అఖిల గత గురువారం ఎవరులేనిది చూసి..ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసుకుని, పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని.. ఆ సమయంలో అఖిల ప్రియుడు రసూల్ ఆమెను ఆటోలో ఎక్కించుకుని వెళ్తుండగా, ఆమె అక్క చూసి అడ్డుకుంది. అఖిల అక్క "నువ్వెవరు?" అని ప్రశ్నించగా.. రసూల్ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనతో అనుమానం వచ్చిన అఖిల కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అఖిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. రసూల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రసూల్ తమ కూతురిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి.. ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కేవలం ప్రేమ వ్యవహారం కాదని.. లవ్ జిహాద్ అని, మతం మార్చాలనే ఉద్దేశంతోనే రసూల్ తమ కూతురిని వలలో వేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే తమ కూతురిని హత్య చేసేందుకు ప్రయత్నించాడని కూడా వారు ఆరోపించారు.
అఖిల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, రసూల్ పై కఠిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. కేసు విచారణలో ఉందని, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
న్యాయం కోసం డిమాండ్..
అఖిల తల్లిదండ్రులు తమ కూతురికి న్యాయం జరగాలని.. లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేసిన రసూల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విద్యావంతురాలైన గిరిజన యువతి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి