Newly Married Bride: ప్రేమించిన వ్యక్తితో గోవాలో పెళ్లి.. ఆరు నెలలకే నవవధువు ఆత్మహత్య

Love Married Bride Commits Suicide In Hyderabad: ప్రేమ పెళ్లికి అంగీకరించి.. అంగరంగ వైభవంగా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసినా కూడా అల్లుడి ఆశ తీరలేదు. అదనపు కట్నం కోసం వేధించడంతో పెళ్లయిన ఆరు నెలలకే నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సంచలనం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 4, 2025, 03:47 PM IST
Newly Married Bride: ప్రేమించిన వ్యక్తితో గోవాలో పెళ్లి.. ఆరు నెలలకే నవవధువు ఆత్మహత్య

Newly Married Women: కుమార్తె ప్రేమించడంతో పెద్దలు కాదనలేకపోయారు. బిడ్డ ఇష్టపడిన వ్యక్తినే అంగీకరించి దగ్గరుండి పెద్దలు పెళ్లి చేశారు. భారీగా కట్న కానుకలు ఇచ్చేసి పెళ్లిని తెలుగు రాష్ట్రాల్లో కాకుండా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేశారు. అనంతరం ఆనందంగా కుమార్తెను అత్తారింటికి పంపారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆరు నెలల తర్వాత కుమార్తె విగతజీవిగా మారింది. అల్లుడు ఫోన్‌ చేసి మీ కుమార్తె చనిపోయిందని బాంబు పేల్చడంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పెళ్లయిన ఆరు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Kavitha Womens Day: 'మార్చి 8న ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేయాలి'

వికారాబాద్ ప్రాంతానికి చెందిన దేవిక (27) ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండేది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న శరత్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. శరత్‌, దేవికకు అయిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పడంతో పెద్దలు అభ్యంతరం తెలపలేదు. వారి పెళ్లికి అంగీకరించారు. 2024 ఆగస్టులో కింద శరత్‌ను దేవిక ప్రేమ వివాహం చేసుకుంది.

Also Read: MK Stalin: 'కొత్తగా పెళ్లయిన వారికి ముఖ్యమంత్రి సంచలన విజ్ఞప్తి.. పిల్లలను కనేయండి'

వివాహం సమయంలో శరత్‌కు రూ.5 లక్షల నగదు, 15 తులాల  బంగారం కట్నకానుకలుగా సమర్పించుకున్నారు. పెళ్లి అనంతరం రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రశాంతి హిల్స్‌లో శరత్‌, దేవిక కాపురం పెట్టారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో అదనపు కట్నం చిచ్చురేపింది. అదనపు కట్నం కోసం కొన్నాళ్లుగా శరత్‌ వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా కొత్త దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం వేధించడంతో దేవిక మానసికంగా కృంగిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇలా చేయడంతో ఆమె విస్తుపోయింది.

ఈ గొడవలతో మనస్తాపానికి లోనయిన దేవిక సోమవారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించిన భర్త శరత్‌ వెంటనే దేవిక కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే చేరుకుని షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కుటుంబసభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదనపు కట్నం కోసం శరత్ తమ కూతురు దేవికను వేధించేవాడని దేవికా తల్లి రామలక్ష్మి ఆరోపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News