)
Adilabad Girl Suicide: ప్రేయసి మరణ వార్తను తట్టుకోలేక ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల పాత కొమ్ముగూడెంలో జరిగింది . 'నా బంగారు తల్లి లేని లోకంలో బతకలేను. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటా..' అంటూ ప్రియుడు వినయ్ (28) కూడా ఒక సూసైడ్ లెటర్ రాసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక నిన్న హితవర్షిని ప్రేమలో విఫలమై సికింద్రాబాద్‌లోని రైలు కిందపడి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె మృతిని తట్టుకోలేక ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరి మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రియురాలు ఆత్మహత్యను జీర్ణించుకోలేని ప్రియుడు ఆ మరుసటిరోజే ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు .
పోలీసుల వివరాల ప్రకారం మంచిర్యాల కొరవిచర్మ గ్రామానికి చెందిన అంజన్న కుమార్తె హిత వర్షిణి (20) ఘట్కేసర్ లోని ఇంజినీరింగ్ కాలేజీలలో బీటెక్ చదువుతోంది. అయితే ఇటీవల సెలవుల కారణంగా ఆమె స్వగ్రామానికి వెళ్ళింది. ఇక సోమవారం తిరిగి మళ్లీ కాలేజీకి రావడంతో ఆదివారం హిత వర్షిని మధ్యాహ్నం సమయంలో సికింద్రాబాద్ చేరుకుంది. ఇక రాత్రి 7 గంటల తర్వాత ఆమె ప్రియుడు వినయ్‌తో ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అదే సమయంలో ఆమె ఘట్కేసర్ - బీబీనగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆమె వద్ద ఉన్న ఐడి కార్డ్ ఆధారాల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక అమృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆమె ప్రియుడు వినయ్ కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే వారి ఫోను సంభాషణ ద్వారా వీరిద్దరు ప్రేమించుకున్నట్లు సమాచారం. వినయ్ లక్సెట్టిపేట కొమ్ముగూడెం శివారు ప్రాంతంలో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హిత వర్షిని చివరిసారిగా వినయ్ కి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు గురించిన వివరాలు సేకరిస్తున్న సమయంలోనే ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే వినయ్ రాసిన సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకొని ఆ వినయ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు. వీరి మృతికి అసలు కారణం ఏంటా? అని పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook