Maganti Gopinath: పక్కా హైదరాబాదీ మాగంటి గోపీనాథ్  సినీ, రాజకీయ నేపథ్యం ఇదే..

Maganti Gopinath Political Background: జూబ్లీహిల్స్  బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఈనెల 5వ తేదీన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చేరిన ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వరుసగా మూడుసార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితం ఏంటో తెలుసుకుందాం

Written by - Renuka Godugu | Last Updated : Jun 8, 2025, 09:46 AM IST
Maganti Gopinath: పక్కా హైదరాబాదీ మాగంటి గోపీనాథ్  సినీ, రాజకీయ నేపథ్యం ఇదే..

Maganti Gopinath Political Background: ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ కిషన్ రెడ్డి తదితరులు మాగంటి మరణానికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఆయన టీఆర్ఎస్‌లో కూడా తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. వరుసగా మూడుసార్లు గెలుపొంది రికార్డు సొంతం చేసుకున్నాడు.

Add Zee News as a Preferred Source

 పక్కా హైదరాబాదీ..
 మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న తెలంగాణలోని హైదరాబాద్ హైదర్‌గూడలో జన్మించారు. ఈ నేపథ్యంలో ఆయన పక్కా హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణమూర్తి మహానందకుమారి. 

రాజకీయ జీవితం..
 డిగ్రీ పట్టా పూర్తి చేసిన తర్వాత అదే ఏడాది 1983లో టీడీపీ తరఫున రాజకీయాల్లోకి వచ్చాడు. మాగంటి గోపీనాథ్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా 1987,1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (HUD) డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లా తరఫు నుంచి తెలుగు దేశం పార్టీలో చాలా చురుగ్గా అనేక హోదాల్లో పని చేశాడు మాగంటి. ఇక మాగంటి గోపీనాథ్‌ సతీమణి పేరు సునీత. వారికి ముగ్గురు సంతానం. మాగంటి వాత్సల్యనాథ్, అక్షర నాగ, దిశిరా.

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో..
 ఇక తెలుగుదేశం పార్టీ నుంచి జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాగంటి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఇక వరుసగా 2018, 2022లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సినీ నిర్మాత..
ఇక మాగంటి రాజకీయాల్లోనే కాదు సినీ నిర్మాతగా కూడా వ్యవహరించారు. పాతబస్తీ (1995) రవన్న (2000) భద్రాద్రి రాముడు (2004) నా స్టైలే వేరు (2009) వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మొత్తానికి 2014 నుంచి 2025 వరకు తిరుగు లేకుండా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు మాగంటి. అంతకుముందు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పీ జనార్దన్ రెడ్డి కుమారుడైన పి విష్ణువర్ధన్ రెడ్డి పనిచేశారు.

Also Read:  సౌమ్యుడు, ప్రజానేత లేకపోవడం పార్టీకి తీరని లోటు.. ఎమ్మెల్యే మృతిపై కేసీఆర్‌ ఎమోషనల్‌.. 

Also Read:  తీవ్ర విషాదం.. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News