Maganti Gopinath Mother Video: నా కొడుకు మరణం ఇప్పటికే మిస్టరీనే.. కేటీఆర్‌పై మాగంటి గోపినాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదే..

maganti Gopinath mother fires on brs ktr: కేటీఆర్ ను ప్రాధేయపడిన కూడా తనను పట్టించుకోలేదని మాగంటీ గోపినాథ్ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకు మరణం వెనుక అసలు కారణం ఏంటో ఇప్పటికి తమకు తెలీయదని వాపోయింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 6, 2025, 08:02 PM IST
  • కేటీఆర్ పై మాగంటి గోపినాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు..
  • జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్..
Maganti Gopinath Mother Video: నా కొడుకు మరణం ఇప్పటికే మిస్టరీనే.. కేటీఆర్‌పై మాగంటి గోపినాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదే..

Maganti Gopinath Mother sensational comments on brs ktr: తెలంగాణలో ప్రస్తుతం  జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల్లో స్పీడ్ పెంచాయి. ఈక్రమంలో నేతల  మధ్య మాటల యుద్దం పీక్స్ కు చేరింది.ఈ క్రమంలో జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే దివంగత నేత మాగంటి గోపినాథ్ తల్లి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారంగా మారాయి. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంపై ఆమె చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా పెద్ద సునామీనే క్రియేట్ చేశాయని చెప్పవచ్చు.

Add Zee News as a Preferred Source

 

మాగంటి గోపినాథ్ తల్లి మాట్లాడుతూ.. అసలు తన కొడుకు ఎలా , ఎందుకు చనిపోయాడో కూడా తమకు తెలీదన్నారు. తన కొడుకు ఆస్పత్రిలో మూడు రోజులు ఐసీయూలో ఉన్నాడని ఇతరులు చెప్తే తెలిసిందన్నారు. అంతేకాకుండా.. ఆస్పత్రికి వెళ్తే కన్న తల్లి అయిన తనను  కొడుకు వద్దకు వెళ్లనీయకుండా సిబ్బంది అడ్డుకున్నారన్నారు. ఎన్నిమార్లు ప్రాధేయపడిన కూడా వెళ్లనీయలేదన్నారు.

ఒకసారి కేటీఆర్ కన్పిస్తే ఆయన దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి తన కొడుకును చూడనియ్యటంలేదని చెప్తే కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేటీఆర్ వచ్చి వెళ్లాక ఆయన చనిపోయాడని ప్రకటించడం వెనుక ఏంజరిగిందో కేటీఆర్ మాత్రమే చెప్పాలని మాగంటి గోపినాథ్ తల్లి డిమాండ్ చేశారు. నా కొడుకు  చనిపోయేటప్పుడు అతనికి 63 తనకు 92 ఏళ్లని.. మూడు రోజులుగా తన కొడుకు చూపు కోసం పరితపించిన కూడా తనను లోనికి రానివ్వలేదని మాగంటి గోపినాథ్ తల్లి షాకింగ్ విషయాల్ని వెల్లడించింది.  

మరోవైపు మొదటి భార్య మాలీనీదేవీ, ఆయన కుమారుడు అంత్యక్రియలకు హజరు కాకుండా కొంత మంది రాజకీయ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. దీనితో పాటు తన కొడుకు డెత్ సర్టిఫికేట్ విషయంలొ కూడా చాలా ఇబ్బందులు పెట్టారని మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న కూడా సంచలన విషయాలు బైటపెట్టారు.

ఈ క్రమంలో మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగుస్తుందనగా.. ప్రస్తుతం మాగంటీ గోపినాథ్ తల్లి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా మారాయి. ఒకవైపు ప్రచారంలో మాగంటి గోపినాథ్ సతీమణి సునీత భర్తను తలచుకుని ఏడుస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు.. ఇది సింపతీ కోసం బీఆర్ఎస్ నేతలు చేప్తే సునీత ఏడుస్తున్నారని తీవ్రవిమర్శలుచేసిన విషయం తెలిసిందే.

Read more: CP Sajjanar: మరోసారి గన్ ఎక్కుపెట్టిన సీపీ సజ్జనార్.. ఎక్స్‌లో సంచలన పోస్ట్..  ఇంకా దబిడి దిబిడే..

మరోవైపు బీఆర్ఎస్ మాత్రం.. మాగంటి గొపినాథ్ సతీమణిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాగంటి గోపినాథ్ తల్లి ఈ విధంగా బీఆర్ఎస్ కేటేీఆర్ పై వ్యాఖ్యలుచేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News