Maganti Sunitha Video: దయచేసి బైటకు రండి.. జూబ్లిహిల్స్ ఓటర్లను వేడుకుంటున్న మాగంటి సునీత .. వీడియో..

Maganti Sunitha slams on congress govt: కాంగ్రెస్ వాళ్లు తాను ఏడిస్తే ఏడ్చానని.. నవ్వితే నవ్వానంటూ రచ్చ చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మండిపడ్డారు. దయచేసి ఓటర్లంతా బైటకు రావాలని పిలుపునిచ్చారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Nov 11, 2025, 04:21 PM IST
  • కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ మాగంటీ సునీత..
  • ఓటర్లు బైటకు రావాలని రిక్వెస్ట్..
Maganti Sunitha Video:  దయచేసి బైటకు రండి.. జూబ్లిహిల్స్ ఓటర్లను వేడుకుంటున్న మాగంటి సునీత .. వీడియో..

Maganti Sunitha brs on jubilee hills by elections:  తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం పూట పలు ఓటింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే అధికారుల కొత్త ఈవీఎంలతో ఓటింగ్ ను ప్రారంభించారు. ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మధ్యహ్నం 3 గంటల వరకు కూడా ఓటింగ్ 40.20 శాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో  బీఆర్ఎస్ జూబ్లిహిల్స్ బైపోల్స్ అభ్యర్థి మాగంటీ సునీత ఉదయం పూట తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Add Zee News as a Preferred Source

 

అదే విధంగా పలు ఓటింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఉండి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని అన్నారు. అంతే కాకుండా.. పోలీసులు కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. అదే విధంగా ఇంకా ఎన్నికలు ముగియడానికి కొన్ని గంటలు మిగిలి ఉందని.. దయచేసి ఓటర్లంతా బైటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొవాలని మాగంటీ సునీత అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. నవీన్ యాదవ్ మనుషులు వచ్చి రేపు నీ సంగతి చెప్తామని నన్నే బెదిరించారన్నారు.

ఇలాంటి రౌడీ రాజ్యాన్ని అడ్డుకోవాలంటే కేసీఆర్ పార్టీని గెలిపించాలన్నారు. భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏముందన్నారు.  పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్లు కూర్చుంటే వాళ్లని కూర్చొనివ్వడం లేదన్నారు. పోలీసులు వారి దగ్గర టేబుల్స్, చైర్లు లాక్కొని దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు.

దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఆకు రౌడీలు అందరిని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పిలిపించారన్నారు. నా భర్త గోపినాథ్ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ ఇంత దౌర్జన్యం ఎన్నడూ చూడలేదన్నారు.

13వ తేదీ వరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండని..  14వ తేదీ తర్వాత నేను గెలిచాక అందరి సంగతి చెప్తానంటూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత  వార్నింగ్ ఇచ్చారు.  బోరబండలో సీఐ కూడా కాంగ్రెస్ నాయకులకు సపోర్ట్ చేస్తున్నాడన్నారు.

మేము పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే, పోలీసులు మమ్మల్ని వీడియోలు తీస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి పోలీసులు వారికి సపోర్ట్ చేస్తున్నారన్నారు.

Read more: Jubilee Hills by polls: జుబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పలువురు స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు.. సీఈఓ సీరియస్..

కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మాగంటి సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు మాకు ఓటు వేయకపోతే మీ ఉద్యోగం తీసేస్తాం అంటు బెదిరిస్తున్నారన్నారు. అభ్యర్థికి పోలింగ్ కేంద్రాలు తిరిగే హక్కు లేదా.. ఇదెక్కడి దౌర్జన్యం!.. అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
 మండిపడ్డారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News