Maha Kumbhmela 2025:మహాకుంభ మేళా వెళ్లే ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ బిగ్ షాకిచ్చాడు. ప్రయాణికులను నడి రోడ్డుమీద వదిలేసిన పరారయ్యాడు. ఈ ఘటన మేడ్చల్‌లో జరిగింది. బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్ ప్రయాణికులు మహాకుంభ మేళా వెళ్లేందుకు బస్సు టికెట్లు బుక్ చేసుకున్నారు. మెహిదీపట్నంలో బస్ ట్రబుల్ ఇచ్చిందని మరో బస్సును అడ్జస్ట్ చేశారు. ఆ బస్సులో వసతులు సరిగ్గా లేవని ప్రయాణికులు కంప్లైంట్ చేసారు. దాంతో బస్సు మేడ్చల్ చేరుకున్నాక డ్రైవర్ బస్సును పక్కకు ఆపి పరారయ్యాడు.
నిన్న మధ్యాహ్నం నుంచి ప్రయాణికులు రోడ్డు మీదనే పడిగాపులు కాసారు. న్యూ ధనుంజయ ట్రావెల్స్‌పై కఠినంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.. ప్రయాణీకుల్లో మహిళలు చిన్నారులు ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. దాంతో తమ పరిస్థితి ఏంటంటూ కుంభమేళా ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో జనవరి 13 పుష్య పౌర్ణమి నుంచి దాదాపు శివరాత్రి వరకు మహా కుంభమేళా జరగనుంది. ఇప్పటికే 40కోట్ల మంది భక్తులు పవిత్ర గంగ, యుమునా, సరస్వతిల సంగమ స్థలమైన ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు ఆచరించారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
అయితే.. మౌనీ అమావాస్య సందర్భంగా జరిగిన అక్కడ తొక్కిసలాట జరిగి 30 మంది కన్నుమూసారు. అయితే.. యోగి తక్షణమే రక్షణ చర్యలు తీసుకొని పరిస్థితి ఒక్క పూటలో కంట్రోల్ లోకి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









