Atmiya Bharosa: మహా శివరాత్రికి తెలంగాణ ప్రభుత్వం కానుక.. కూలీలకు నిధులు విడుదల

Indiramma Atmiya Bharosa Funds Released For Mahabubnagar And Rangareddy Districts: మహా శివరాత్రి వేళ తెలంగాణ ప్రభుత్వం కూలీలకు కానుక అందించింది. ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే కొన్ని ప్రాంతాలవారీకే విడుదల చేయడం గమనార్హం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 26, 2025, 01:58 PM IST
Atmiya Bharosa: మహా శివరాత్రికి తెలంగాణ ప్రభుత్వం కానుక.. కూలీలకు నిధులు విడుదల

Indiramma Atmiya Bharosa: ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం మహా శివరాత్రి కానుక అందించింది. కూలీలకు సంబంధించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా  నిధులు జమ చేసింది. మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున నిధులు జమయ్యాయి. జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కింద ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామసభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది.

Add Zee News as a Preferred Source

Also Read: Zoo Park Price Hike: పర్యాటకులకు షాక్.. భారీగా పెరగనున్న జూపార్క్ ధరలు

శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమాళి అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం నిలిచిపోయింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Also Read: Neera Cafe: హైదరాబాద్‌ ప్రజలకు భారీ షాక్‌.. నీరా దుకాణం బంద్‌?

రెండు ఉమ్మడి జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం చెల్లించింది. 66,640 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు జమ చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక సీజన్‌కు రూ.6000 చొప్పున ఉపాధి కూలీలకు భరోసా కల్పిస్తోంది. డీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ అవుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News