Mla Sabitha indrareddy hospitalised: మాజీ మంత్రి.. ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆమెను పార్టీ నేతలు హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు. సబితమ్మ.. నిన్న మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ తో అనేక మంది గులాబీశ్రేణులు, ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో హజరయ్యారు. మొదటి విడత విడత సమావేశం కాగానే లంచ్ ను చేసుకున్నారు.
ఆ తర్వాత సబితకు ఇబ్బందిగా అన్పించడంతో అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలోనే సబిత ఒక్కసారిగా అనారోగ్యంకు గురికావడంతో ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. ఆమెకు పలుటెస్టులు చేశారు. సబితకు వడదెబ్బతో పాటు..అజీర్తి సమస్య వల్ల బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
ఈ క్రమంలో ఆమెకు సెలైన్ లు ఎక్కించి.. రాత్రి వరకు డాక్టర్లు అబ్జర్వేషన్ లో ఉంచుకున్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగు పడటంతో ఆమెను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత రాత్రి.. సబిత ఇంద్రారెడ్డి హైదరబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో గులాబీ నేతలు, పలువురు బీఆర్ఎస్ నాయకులు సబిత ఆరోగ్యంపట్ల ఆందోళనలకు గురయ్యారు. అంతేకాకుండా.. కార్యకర్తలు సైతం సబితమ్మకు ఏమైందని టెన్షన్ కు గురయ్యారు. ప్రస్తుతం సబిత తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు,మాజీ మంత్రులతో ఎర్రవెల్లిలొని తన క్యాంపు ఆఫీసులో సమావేశం అయ్యారు.
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అనేక రాజకీయ అంశాలపై చర్చలు జరిపారు. మరోవైపు ఇటీవల బీసీ వాదంపై చోటు చేసుకుంటున్న పరిణామలు, మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ శ్రేణులు ఏవిధంగా ముందుకు వెళ్లాలో.. కేసీఆర్ తో నేతలు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. మొత్తంగా గులాబీ దళపతి మాత్రం గట్టి వ్యూహంతోనే సీఎంరేవంత్ ను ఎదుర్కొనేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









