Malla Reddy Hot Comments on Revanth Reddy: మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై రెచ్చిపోయారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హాట్ రేవంత్ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ కౌరవుల చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్ నేతలకు పాలన చేతకావడం లేదన్నారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అంతేకాదు తెలంగాణలో ప్రజలందరు నిరాశ, నిసృహల్లో ఉన్నారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాపార కార్యక్రమాలు డల్ అయ్యాయి. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామిల్లో ఏది నెవవేరలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అంటూ ఉన్న బస్సులను లేకుండా చేశాడు.
మరోవైపు రైతులకు రుణ మాఫీ కూడా నీటి మూటలే అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చాకా నిరోద్యోగులకు ఇస్తాన్నన ఉద్యోగాలు ఎక్కడా ప్రశ్నించారు. కొలువు ఎక్కడా.. ? జాబ్ క్యాలెండర్ ఏది అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చేసిన పనులకు సరైన సమయంలో బిల్లులు చెల్లించడం లేదు. రియల్ ఎస్టేట్ పడకేయడంతో దాన్ని నమ్ముకొని చిన్న చిన్న కార్పెంటర్.. ఎలక్ట్రీషియన్, ప్లంబర్ పనులు, మేస్త్రీ పనులు చేసే వాళ్లకు పనిలేకుండా పోయిందన్నారు.
తెలంగాణ సర్కారు నిర్వాకం వల్ల వాళ్లందరు రోడ్డున పడిన విషయాన్ని ప్రస్తావించారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. రైతులకు, సామాన్యలు కూడా కరెంట్ కష్టాలు అనుభవిస్తున్నారు. అన్ని రంగాలు పడకేసాయన్నారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. మొత్తంగా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మల్లారెడ్డి విద్యా సంస్థలతో పాటు ఆయన నిర్వహిస్తున్న వాటిపై దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మధ్యలో కొంత కాలం సైలెంట్ గా ఉన్న మల్లారెడ్డి.. తాజాగా రేవంత్ ప్రభుత్వంపై వైలెంట్ గా రెచ్చిపోవడం ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









