Extramarital Affair: బాబాయ్ కాదు.. పరమ దుర్మార్గుడు.. తల్లితో ఎఫైర్, కూతురికి కడుపు

Mahabubabad Extramarital Affair Case: మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని.. ఆమె కూతురిపై కన్నేసి గర్భవతిని చేశాడు ఓ కామంధుడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 22, 2025, 07:40 PM IST
Extramarital Affair: బాబాయ్ కాదు.. పరమ దుర్మార్గుడు.. తల్లితో ఎఫైర్, కూతురికి కడుపు

Mahabubabad Extramarital Affair Case: కామంధులు రెచ్చిపోతున్నారు. వావివరుసలు మరిచి.. కామంతో కళ్లు మూసుకుని.. బంధాలను పక్కనబెట్టి తమ దుర్మార్గమైన కోరికలు తీర్చుకుంటున్నారు. ఓ వైపు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. ఇవేమి తమకు వర్తించవంటూ కామంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా అత్యంత ఘోరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ దుర్మార్గుడు.. ఆమె కూతురిపై కూడా కన్నేశాడు. తల్లి సహకారంతో బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు. వరుసకు మరిదయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న తల్లి.. కన్న కూతురిని ఆ దుర్మార్గుడి కామ దాహానికి బలి చేసింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా.. 

న‌ర్సింహుల‌పేట మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన దంపతలు మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో నివాసముంటోంది. ఈ క్రమంలో వరుసకు మరిదయ్యే రాము అనే వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధ ఏర్పడింది. తరచూ ఇంటికి వస్తూ తల్లిని వలలో వేసుకున్న ఆ కామాంధుడు.. ఆమె కూతురిపై కూడా కన్నేశాడు. ఈడొచ్చిన ఆ బాలిను ఎలాగైనా వశపరుచుకోవాలని అనుకున్నాడు. ఆ దుర్మార్గుపు ఆలోచనకు తల్లి కూడా సహకారం అందించింది.

ఈ నేపథ్యంలోనే తల్లి ప్రోద్బలంతో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి బాలిక గర్భం దాల్చింది. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక.. తన అమ్మమ్మకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. బాలిక గర్భవతి అయిన విషయం ఎవరికి చెప్పకుండా.. గుట్టుచప్పుడు కాకుండా తొర్రూరులోని అమ్మ ప్రైవేట్ హాస్పిటల్‌లో అబార్షన్ చేయించింది అమ్మమ్మ. అయితే బాలికకు అబార్షన్ జరిగిన విషయంపై చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అధికారులు విచారణ చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రియుడితో కలిసి తల్లి చేసిన దారుణం గురించి తెలిసి షాక్‌కు గురయ్యారు. అబార్షన్ నిర్వహించిన ఆసుపత్రితోపాటు కామాంధుడు రాము.. ఆ దుర్మార్గుడికి సహకరించిన బాలిక తల్లిపై తొర్రూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలిక చెప్పిన విషయాలను రికార్డు చేశామని జిల్లా అడిషనల్ సీడీపీఓ విజయలక్ష్మీ తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించామని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు.  

Also Read: Bandi Sanjay: అధ్యక్ష రేసులో లేను.. చెన్నైలో జరిగేది దొంగల ముఠా సభ .. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Also Read: Delimitation: నియోజకవర్గాల పునర్విభజనపై జగన్ స్టాండ్ ఇదే, ప్రదాని మోదీకు లేఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News