Man marries both his girlfriend at same ceremony in komaram bheem video: ఇటీవల కాలంలో చాలా మంది యువత అసలు పెళ్లిళ్లు కావాలంటేనే నానా తంటాలు పడుతున్నారు. ఎంత మంచి ఉద్యోగం ఉన్నా..లైఫ్ లో ఎంత బాగా సెటిల్ అయిన కూడా అమ్మాయి తరుపు వారు లేని పోనీ లోపాలు చూపించి మరీ పెళ్లి సంబంధాలను రిజక్ట్ చేస్తున్నారు.
మరికొన్ని చోట్ల అమ్మాయిలు అసలు ఏ మాత్రం కూడా తగ్గడంలేదు. తమకు కావాల్సిన మ్యాచ్ దొరికే వరకు ఎంత వరకైన వెళ్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది యువకులు అసలు.. తమకు పెళ్లి అవుతుందా.. అని టెన్షన్ పడుతున్నారు.ఈ క్రమంలో ఒక యువకుడు ఒకేసారి ఇద్దర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఒకే మండపంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు
ఆహ్వాన పత్రికల్లో సైతం ఇద్దరు యువతుల పేర్లు ముద్రించి, ఘనంగా వివాహం చేసుకున్న యువకుడు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్న… pic.twitter.com/Tbre507zTB
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2025
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరిగిన పెళ్లి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సూర్యదేవ్ అనే యువకుడు.. లాల్ దేవీ, జల్కర్ దేవీ లను ప్రేమించాడు. ఇద్దరు కూడా సూర్యదేవ్ ను మనసారా ప్రేమించారు. ముగ్గురు కలిసి ఉండేందుకు తమకు అభ్యంతరం లేదని కూడా వాళ్లు ముందే మాట్లాడుకున్నారు.ఈ క్రమంలో మొదట పెద్ద వాళ్లు అంగీకరించకున్న.. ఆతర్వాత వీళ్ల ప్రేమను చూసి, అర్థం చేసుకుంటామన్న మాటల్ని విని పెద్దలు వీళ్ల పెళ్లిళ్లకు అంగీకరించారు.
ఈక్రమంలో యువకుడు.. ఇద్దరమ్మాయిలతో ఒకేసారి పెళ్లిని చేసుకున్నాడు. లాల్ దేవీ, జల్కర్ దేవీలతో పెళ్లి పత్రిక కూడా కొట్టించాడు. అంతే కాకుండా.. అందరి ముందు.. పెళ్లి మండపంలో.. ఇద్దరమ్మాయిలతో పెళ్లివేడుక గ్రాండ్ గా జరిగింది. వీళ్ల పెళ్లికి గ్రామస్థులంతా తరలివచ్చారు. అందరి ముందు సప్తపది ఏడడుగులు వేసి.. మూడు మూళ్లు ఇద్దరి మెడలో వేర్వేరుగా కట్టాడు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు నువ్వు గ్రేట్ భయ్యా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక పెళ్లికే నానా తంటాలు పడుతున్న సమయంలో.. నువ్వు ఒకేసారి రెండు పెళ్లిళ్లుచేసుకున్నావ్.. నువ్వు తోపు భయ్యా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









