Hyderabad: బట్టతలపై జుట్టుతెప్పిస్తానని ఛాలెంజ్.. పాత బస్తీలో లబో దిబో మంటున్న యువకులు.. వీడియో వైరల్..

Hairs growth on bald head: బట్టతలపై వెంట్రుకలు లేని యువత ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరంలేదని ఓల్డ్ సిటీలోని బిగ్ బాస్ సెలూన్ లో కొంత మంది ప్రచారం నిర్వహించారు. ఈక్రమంలో   చాలా మంది యువత తమ బట్టతల మీద ట్రీట్మెంట్ కోసం ఓల్డ్ సిటీకి క్యూలు కట్టారు.ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 7, 2025, 01:41 PM IST
  • బట్టతలపై జుట్టు తెప్పిస్తానని ప్రచారం..
  • ఆస్పత్రి పాలైన యువకులు..
Hyderabad: బట్టతలపై జుట్టుతెప్పిస్తానని ఛాలెంజ్.. పాత బస్తీలో లబో దిబో మంటున్న యువకులు.. వీడియో వైరల్..

Man promoting hair growth on bald head in old city video: చాలా మంది ఇటీవల కాలంలో బట్టతల సమస్యతో తెగ టెన్షన్ పడుతున్నారు. ఏజ్ కు ముందే తల మీద వెంట్రుకలు రాలిపోవడంతో చాలా మందికి అసలు పెళ్లిళ్లు కూడా కావడంలేదు. తమ బట్టతలను కవర్ చేసుకోలేక చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. మరికొందరు అయితే.. మార్కెట్ లో దొరికే ప్రతి ప్రాడక్ట్ ను తమ జుట్టుకు అప్లై చేసుకుంటారు.  ఈ క్రమంలో కొంత మంది యువత వీక్ నెస్ ను క్యాష్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

Add Zee News as a Preferred Source

 

మార్కెట్ లో ఏదో కొత్త బ్రాండ్ అని.. వనమూలికలతైలం అని చెబూతూ యువతను మోసంచేస్తున్నారు.  కొంత మంది తమ బట్టతలను దాచుకునేందుకు విగ్ లను కొనుక్కుంటున్నారు. మరికొందరు బట్టతలపై బైటకు వెళితే టోపీలను పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓల్డ్ సిటీలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 

పూర్తి వివరాలు..

ఓల్డ్ సిటీలోని కామటి పూర్ లోని చందూలాల్ బారదారి మార్గంలో బాగ్ బాస్ మెన్స్ పార్లర్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. తమ పార్లర్ కు వస్తే.. బట్టతల మీద వెంట్రుకలు వచ్చేలా చేస్తామని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా.. గతంలో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కు సైతం తలమీద వెంట్రుకలు వచ్చేలా చేశామని ప్రచారం చేశారు. అంతే కాకుండా.. డబ్బులు కూడా తీసుకొమని..ఉచితంగా సర్వీస్ చేస్తామని కూడా చెప్పారు. దీంతో యువత ఇది నిజమనుకుని ఓల్డ్ సిటీకి క్యూలు కట్టారు.

ఈ క్రమంలో వకీల్ అనే యువకుడు వాళ్ల బట్టతల మీద ఏదో క్రీమును రాస్తు.. దాన్ని కొన్ని గంటల పాటు అలానే ఉండాలని చెప్పాడు. ఈ క్రమంలో బట్టతల ట్రీట్మెంట్ కోసం.. ఢిల్లీ, బెంగళూరు, మహారాష్ట్ర హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున యువత వచ్చారు. అయితే.. చాలా మంది దగ్గర గుండుకు వందరూపాయలు వసూలు చేశాడు. ఆ తర్వాత బట్టతలపై పెట్టిన క్రీమ్ కిందకు జారకూడదని చెప్పి పచ్చి బట్టతో జుట్టంతా  చుట్టుకొవాలని చెప్పాడు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలా మంది బట్టతలపై మంటతో ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Read more: Snake Video: తోక మీద నిలబడి బుసలు కొడుతున్న కోబ్రాను చూశారా..?.. అరుదైన వీడియో మీ కోసం..

మొత్తంగా ఫుకట్ ల బట్టతల మీద జుట్టు వస్తుందని ఓల్డ్ సిటీకి వెళ్లిన యువత .. ప్రస్తుతం గుండు మంటతో ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు. అయితే.. దీనిపై కొంత మంది పాజిటీవ్ గా చెప్తుండటం కూడా చాలా మందికి అయోమయానికి గురిచేస్తుందని చెప్పుకొవచ్చు. మొత్తంగా  ఈ బట్టతల మీద ట్రీట్మెంట్ కు చెందిన వీడియోలు నెట్టింట వైరల్గా మారింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News