)
Married woman extra marital affair with minor boy in khammam: ఇటీవల కాలంలొ కొంత మంది మహిళలు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. అసలు.. వీళ్లను చూస్తుంటే మహిళలు అన్న పదానికి మాయని మచ్చగా మారుతున్నారు. కొంత మంది పెళ్లి చేసుకుని తమ భర్తల్ని చంపేస్తున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి కన్నవాళ్లను, కట్టుకున్న వాళ్లను సైతం కాటికి పంపుతున్నారు. ఇలాంటి ఘటనలు మనం తరచుగా వార్తలలో చూస్తున్నాం.
అయితే.. కొన్ని చోట్ల మరీ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నాం.. మరీ మగాళ్లకన్నా తామేం తక్కువ అనుకుంటున్నారో ఏంటో కానీ.. కొంత మంది కిలేడీలు ఇటీవల మైనర్లను లొంగదీసుకుని మరీ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. తెలంగాణ ఖమ్మంలోని సత్తుపల్లిలో ఈ కోవకు చెందిన గలీజ్ పని వెలుగులోకి వచ్చింది.
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి చెందిన పెళ్లైన మహిళ కొన్ని రోజులుగా తన భర్తను వదిలేసి విడాకులు తీసుకుని సపరేట్ గా ఉంటుంది. ఆమెకు 26. అయితే.. అదే గ్రామంలో ఉంటున్న మైనర్ బాలుడ్ని ట్రాప్ చేసింది. అతనికి మాయ మాటలు చెప్పి లొంగదీసుకుంది. ఈ క్రమంలో అతడ్ని ఇటీవల కిడ్నాప్ చేసి ఏపీకి తీసుకెళ్లింది. అక్కడ గుడిలో పెళ్ళి చేసుకుని ఆంధ్ర ప్రాంతంలో రహస్య కాపురం కుడా పెట్టింది.
బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.వీరిపై విచారణ చేపట్టగా.. ఏపీలో ఉన్నట్లు విషయం బైటపడింది. దీంతొ పోలీసులు సదరు మహిళ త్రివేణిని అరెస్ట్ చేశారు. మైనర్ బాలుడ్ని లొంగ దీసుకొవడం, పెళ్లి చేసుకున్నందుకు ఆమెపై పోక్సొ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అయితే.. సాధారణంగా పురుషుల మీద తరచుగా పొక్సొ కేసులు వంటివి కామన్ గా వింటుంటాం. కానీ ఇక్కడ మాత్రం రోటీన్ ను భిన్నంగా మైనర్ బాలుడ్ని ట్రాప్ చేసుకుని పెళ్లి, ఆపై అతడితో గడపడం వంటి వాటిపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సొ కేసు నమోదు చేయడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.