Medchal married woman elope video: ఇటీవల కాలంలో పెళ్లికి ఉన్న పవిత్ర బంధాన్ని చాలా మంది దిగజారుస్తున్నారు. పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు ఒకరికి మరోకరు అండగా ఉంటామని చెప్పుకొని.. పశువుల కన్న హీనంగా ప్రవర్తిస్తున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితంలో పాటు.. కట్టుకున్న వారి జీవితంను కూడా నాశనం చేస్తున్నారు. మొత్తంగా వివాహా బంధాన్ని తమ నీచమైన పనులతో నవ్వుల పాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో భార్యభర్తల గొడవలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది భర్తలు ఇటీవల భార్యల వేధింపులు భరించలేక సెల్పీ వీడియోలు తీసుకుని మరీ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడోక మహా ఇల్లాలు.. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి.. ఫెస్ బుక్ లో పరిచయం అయిన యువకుడితో పరారైంది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత
మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్
తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన… pic.twitter.com/e0oDcb0593
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025
మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ భర్త జయరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన గోపి అనే యువకుడితో తన భార్య వెళ్లిపోయినట్లు తెలిపాడు. అయితే.. వీరిద్దర్ని ఇంట్లో నుంచి పారిపోతుండగా.. భర్త గమనించాడు. ఇద్దర్ని మేడ్చల్ పరిధిలోని ఆక్సిజన్ పార్కు లో గుర్తించాడు.
దీంతో భర్తను గమనించి.. ఇద్దరు బైక్ వదిలేసి రన్నింగ్ బస్సు ఎక్కి మరీ పారిపోయారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఫెస్ బుక్ లో పరిచయమైన గోపీ.. వివాహితను చాలా ప్రేమగా చూసుకునే వాడని.. ఎప్పుడు కేరింగ్ గా ఉండేవాడని.. దీంతో మహిళ అతను చూపిస్తున్న ప్రేమకు టెంప్ట్ అయి భర్త, పిల్లల్ని వదిలేసి వెళ్లినట్లు సమాచారం.
మరోవైపు.. యువకుడి తండ్రి మాత్రం.. తమ కొడుకును ఆమె వల్లో వేసుకుని లేపుకొని వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ కోసం తమ కొడుకును హైదరబాద్ కు పంపామని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









