McDonalds: మెక్‌ డొనల్డ్స్‌ అడ్డా తెలంగాణ.. హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఆఫీస్‌ ఏర్పాటు

McDonalds Sets India Global Office In Hyderabad: పిజ్జా, బర్గర్‌లతోపాటు బేకరీ ఉత్పత్తులు.. విదేశీ వంటకాలను రుచిగా అందించే మెక్‌ డొనల్డ్స్‌ తెలంగాణను అడ్డాగా చేసుకుంది. తమ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని మెక్‌డొనల్డ్స్‌ ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 19, 2025, 06:51 PM IST
McDonalds: మెక్‌ డొనల్డ్స్‌ అడ్డా తెలంగాణ.. హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఆఫీస్‌ ఏర్పాటు

McDonalds India Global Office: తెలంగాణలో పెట్టుబడుల వరద కొనసాగుతోంది. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణను అడ్డాగా మార్చుకోబోతున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో భారతదేశానికి సంబంధించిన గ్లోబల్‌ ఆఫీస్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ కార్యాలయం ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో మరిన్ని మెక్‌ డొనల్డ్స్‌ ఔట్‌లెట్‌లు విస్తరించాలని భావిస్తోంది. వీటి ద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆ ఒప్పందం వివరాలు ఇలా ఉన్నాయి. 

Add Zee News as a Preferred Source

Also Read: Bandi Sanjay: 'తెలంగాణ బడ్జెట్‌ మొత్తం 'ఓం భూం బుష్'.. అందులో డొల్లతనమే'

మెక్ డొనాల్డ్స్‌ సంస్థ భారతదేశంలో విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్‌ నగరంలో తన ఇండియా గ్లోబల్ ఆఫీస్‌ను నెలకొల్పనున్నట్లు ఈ సందర్భంగా మెక్‌ డొనల్డ్స్‌ ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం తెలంగాణ ప్రభుత్వంతో మెక్‌ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో  క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి మెక్ డొనాల్డ్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది.

Also Read: K Kavitha: 'బడ్జెట్‌లో ప్రవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ': ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా చర్చలు చేశారు. మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంపై ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఈ గ్లోబల్ సెంటర్ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న సందర్భంలో మెక్ డొనాల్డ్ సంస్థ తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం తరఫున ఉత్తమమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను కంపెనీ ప్రతినిధులకు అధికారులు వివరించారు. తెలంగాణ యువతకు గ్లోబల్ ఆఫీస్‌లోనే కాకుండా దేశ విదేశాల్లో  తమ ఆఫీసులు, అవుట్ లెట్లలో ఉద్యోగాలు కల్పించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  

మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని సంస్థ ప్రతినిధులను ప్రభుత్వం కోరింది. రైతుల ఆదాయం పెరుగడంతోపాటు రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన  నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు ఉన్నాయని మెక్ డొనాల్డ్ సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్‌డొనాల్డ్స్ ఔట్‌ లెట్లు ఉండగా ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్ లెట్లను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News