)
Drugs Awareness Programme: 'తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. నిజామ్‌లకు రాజా కార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు పుట్టిన గడ్డ ఇది. ఆ పోరాట స్ఫూర్తి నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్ర యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం న్యాయమా?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని హెచ్చరించాం' అని గుర్తుచేశారు.
'ఉద్యమాల గడ్డ తెలంగాణ పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ మహమ్మారికి బలవుతుంటే చూస్తూ కూర్చుందామా?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'దేశ జనాభాలో 68 శాతం యువత ఉన్నారు. ప్రపంచంలో 68 శాతం యువత ఉన్న ఏకైక దేశం భారతదేశం. శత్రు దేశాలు మన దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నాయి. వాటిలో డ్రగ్స్ ఒకటి' అని వివరించారు. 'పంజాబ్‌లో గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా మారి యువత నిర్వీర్యమైంది. తెలంగాణలో యువత నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది' అని చెప్పారు.
'ఏ పాలసీ లేని తెలంగాణలో మేం అధికారంలోకి రాగానే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చాం. యువతలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. నల్లమల నుంచి వచ్చిన నేను జెడ్పీటీసీ స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా. నాలాగే విజయ్ దేవరకొండ నల్లమల నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగారు' అని తెలిపారు. కష్టం, కమిట్మెంట్ లేకుండా ఈ స్థాయికి రాణించలేరని పేర్కొన్నారు.
'మాదక ద్రవ్యాల నియంత్రణకు కలిసికట్టుగా ముందుకు రావాలి. నో డ్రగ్స్‌కు మీరే వారధులుగా మారండి. పాఠశాలలు, కళాశాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలి. విద్యార్థుల వ్యవహార శైలిని గమనించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. మీ సంస్థల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా పర్యవేక్షించాల్సినబాధ్యత యాజమాన్యాలదే' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మనందరం అప్రమత్తంగా ఉంటేనే మాదకద్రవ్యాలను నియంత్రించగలమని తెలిపారు. ఉద్యమాల గడ్డ తెలంగాణ గంజాయి, డ్రగ్స్‌కు వేదిక కావద్దని విజ్ఞప్తి చేశారు. మీరు, మేము, మనం కలిస్తేనే ప్రపంచానికే ఆదర్శవంతంగా తెలంగాణను తీర్చిదిద్దగలుగుతామని పేర్కొన్నారు.
పేరు మార్పు
తెలంగాణ న్యాబ్‌ను ఇక నుంచి ఈగల్‌గా (EAGLE- ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈగల్ తెలంగాణలో ఎక్కడ గంజాయి పండించినా పసిగడుతుందని.. అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే పసిగడుతుందని వివరించారు. చదువు, స్పోర్ట్స్‌లో రాణించి హీరోలుగా నిలవాలని.. ఉద్యోగాల్లోనే కాదు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోనూ స్పోర్ట్స్ పర్సన్స్‌కు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.