
Medak Nizamabad Karimnagar Adilabad mlc elections: తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. ఈ నెల 27న .. మెదక్ -నిజామాబాద్ -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగుల కోసం రిటర్నింగ్ అధికారి కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేందుకు ఈ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని ఆదేశాలలో వెల్లడించారు.
వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్, అథారిటీలలో పని చేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు సైతం వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలని, ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పనిచేస్తున్న వారికి వెసులుబాటు ఇవ్వాలని కూడా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతి కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా..
ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు షిఫ్టుల సర్దుబాటు చేయాలని ఆదేశించారు. డ్యూటీ గంటల తగ్గింపు, ఆలస్యంగా హాజరుకావడానికి అనుమతి వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
అయితే.. ముఖ్యంగా.. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ.. తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకొవాలని కలెక్టర్ పమేలా సత్పతి కీలక ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం ప్రత్యేక సాధారణ సెలవు, వెసులుబాట్లను సద్వినియోగం చేసుకొవాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి