Chiranjeevi to Visit His Fan at Secunderabad Gandhi Hospital: మెగాస్టార్ చిరంజీవి త్వరలో గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఉన్నట్లుండి ఆయన గాంధీ ఆసుపత్రికి ఎందుకొస్తున్నారనే సందేహం చాలామందికి కలగవచ్చు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన అభిమానిని కలిసేందుకు చిరు అక్కడికి రానున్నారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న 60 ఏళ్ల వృద్ధురాలిని ఆయన కలవనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆ వృద్ధురాలు చిరంజీవి అభిమాని. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో అవేక్ క్రేనియోటమీ పద్దతిలో ఆమెకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. అంటే స్పృహలో ఉండగానే వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు. రెండు గంటల పాటు సర్జరీ చేసి మెదడులో ఉన్న కణితిని తొలగించారు. సర్జరీ సమయంలో పేషెంట్‌కు ఒక ట్యాబ్ ఇవ్వగా.. అందులో ఆమె తన అభిమాన హీరో చిరంజీవి 'అడవి దొంగ' సినిమా చూస్తూ సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ విజయవంతమవగా ప్రస్తుతం ఆసుపత్రిలోనే కోలుకుంటున్నారు.


వృద్ధురాలు అడవి దొంగ సినిమా చూస్తూ బ్రెయిన్ సర్జరీ చేయించుకుందనే విషయం మీడియా ద్వారా చిరంజీవికి తెలిసింది. వెంటనే తన పీఆర్వోని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. పీఆర్వో సికింద్రాబాద్ సూపరింటెండెంట్‌ను కలిసి ఆ వృద్దురాలి గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆమెతో నేరుగా మాట్లాడారు. తాను చిరంజీవి అభిమానిని అని, ఆయన సినిమాలన్నీ చూస్తుంటానని ఈ సందర్భంగా వృద్ధురాలు పీఆర్వోతో చెప్పింది. 


అదే విషయాన్ని పీఆర్వో చిరంజీవికి ఫోన్‌లో చెప్పగా.. వీలు చూసుకుని 2, 3 రోజుల్లో ఆసుపత్రికి వస్తానని చిరు వెల్లడించారు. ఈ విషయాన్ని గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావుకు చిరు పీఆర్వో తెలియజేశారు. విషయం తెలిసి ఆ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత పెరిగిందంటే..  


Also Read: September 2022 Movie Releases: ఏకంగా 17 సినిమాలు రిలీజ్.. లిస్టు ఇదే!
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook