)
Employees Pending Salarie And Bills: వేతనాలు, బిల్లుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైన రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు మధ్యాహ్న భోజన కార్మికులు కూడా ఆందోళన చేపడుతున్నారు. వారికి రావాల్సిన వేతనాలతోపాటు బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. భారీగా బకాయి పడడంతో వారు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావును కలిసి తమ సమస్యలపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు.
‘మా గోడును పట్టించుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి’ అంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావును శుక్రవారం వరంగల్ మధ్యాహ్న భోజన కార్మికులు కలిసి విన్నవించారు. ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చెందవద్దని.. డిమాండ్లు నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మధ్యాహ్న భోజన కార్మికులకు మాజీ మంత్రి హరీశ్ రావు భరోసా కల్పించారు.
అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 'మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రేవంత్ రెడ్డి కర్కశంగా, కఠినంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణం' అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని నమ్మించి ఇప్పుడు నయవంచన చేయడం ద్రోహం చేయడమే అని ప్రకటించారు.
ఉన్నఫళంగా మధ్యాహ్న భోజన పథకం నుంచి దూరం చేస్తే 20 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికుల పరిస్థితి ఏం కావాలని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఏడాదికాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనాలు పెట్టిన ఆ చిరు ఉద్యోగుల ఆర్థిక భారం ఎవరు తీర్చాలి? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో మధ్యాహ్న భోజన కార్మికుల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించాలని కాంగ్రెస్ సర్కార్‌కు సూచించారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.