)
Minister Adluri Laxman responds over minister Vivek Venkat swamy: మాలల ఐక్యతా సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి తాజాగా.. తనపై కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రి అడ్లూరీ తన ఎదుగు దలను చూపి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అందుకు తనను కావాలని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగని మంత్రుల పంచాయతీ
మంత్రి వివేక్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
వివేక్ నా పేరు తీసి మాట్లాడడం అత్యంత బాధాకరం
నేను ఒకటే పార్టీకి, ఒకటే జెండాకు కట్టుబడి ఉన్నా.. పార్టీ లైన్ దాటి ప్రవర్తించను
మా మద్యలో ఏదైనా ఉంటే ఇంటర్నల్‌గా కూర్చొని… https://t.co/eydQAL3bzq pic.twitter.com/LxmCR3t7FB
— Telugu Scribe (@TeluguScribe) October 12, 2025
కుట్రపూరీతంగా తాను మాల సామాజికవర్గంకు చెందిన వాడినని, తనపై ఆరోపణలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో తనకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు.
దీనిపై మరోసారి మంత్రి అడ్లూరీ కౌంటర్ ఇచ్చారు. వివేక్ వెంకట స్వామి చేసిన వ్యాఖ్యలు బాధకరమన్నారు. మంత్రి వివేక్ నా పేరు తీసి మాట్లాడడం అత్యంత శోచనీయమన్నారు. తాను మొదటి నుంచి ఒకటే పార్టీకి, ఒకటే జెండాకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా.. పార్టీ లైన్ దాటి ప్రవర్తించనని తెల్చి చెప్పారు.
మా మధ్యలో ఏదైనా ఉంటే ఇంటర్నల్‌గా కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేదని అన్నారు.కానీ ఈ విధంగా ఒక సభలో మాట్లాడటం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందన్నారు. మరోవైపు వివేక్ మాట్లాడిన మాటలు ఆయన విజ్ఞతకు, మర్యాదకు, గౌరవానికి వదిలేస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టంచేశారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మధ్య మంత్రుల మధ్య పంచాయతీలు మాత్రం ఆగడంలేదు. మొత్తంగా ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, సీతక్క సైతం.. పొంగులేటిశ్రీనివాస్ రెడ్డిపై పీసీసీతో పాటు, కాంగ్రెస్ హైకమాండ్ కు సైతం ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ లొ సొంత పార్టీ మంత్రుల మధ్య రచ్చ కాస్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook