)
Minister Jupally Krishna Rao Comments: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని స్థానికులు ఆయనను కోరగా.. తాను హామీలు ఇవ్వనని వచ్చేసారి తాను మళ్లీ గెలుస్తానో లేదో తెలియదన్నారు. ఒకవేళ తాను గెలిచినా.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదని.. అందుకే ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వలేనని చెప్పారు. మన చేతుల్లో ఉన్నది అయితే ఇవ్వొచ్చని.. హామీ ఇచ్చి మోసం చేయడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే తన వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. బోథ్‌లో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవంలో మంత్రి ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కేటీఆర్ పార్టీ ఫిరాయింపులపై చేసిన కామెంట్స్‌కు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌కు సిగ్గుందా అని మాట్లాడారు. "ఫిరాయింపులు జరిగాయా లేదా అనేది సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. న్యాయస్థానం ముందు ఉన్న అంశం మాట్లాడుతున్నారు. సిగ్గు ఉందా అన్న పదం ఇప్పుడు కేటీఆర్‌కు ఎందుకు గుర్తుకు వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పెగ్గులు పోసే సంతోష్ కుమార్‌కు రాజ్యసభ ఇచ్చారు. అప్పుడు సిగ్గు గుర్తుకు రాలేదా..? అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక్కటైనా పరిపాలన చేశారా..?
మీ సోదరి కవితనే చెప్పింది కదా వేల కోట్ల అక్రమార్జన జరిగిందని.. దానికి సమాధానం చెప్పకుండా సస్పెండ్ చేస్తే సరిపోతుందా. మీ కుటుంబ సభ్యులు అయిన కవిత ఏం తెలియకుండానే మాట్లాడిందా..? ఆమె ఏం తక్కువ తినలేదు. అందరూ ఒక తాడు ముక్కలే. అవగాహన లేకుండా ఎమ్మెల్యేలు అయ్యారా..? సమాధానం ఇస్తున్నారు కదా. ప్రభుత్వం కూలిపోతుంది అని ఏ లెక్కన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని బీజేపీ, BRS చూశారు. నిర్ణయాలు చట్టప్రకారం ఉంటాయి.. కోర్టులు, స్పీకర్ వ్యవస్థలు ఉన్నాయి.
88 స్థానాలు గెలిచాక.. అనడు మీరు ఎందుకు తప్పుడు పనులు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మీరు.. మళ్లీ మీరే పెడబొబ్బలు పెడుతున్నారు. అక్షయ పాత్ర లాంటి రాష్ట్రాన్ని వేల కోట్లు దోచుకున్నారు. సిగ్గుందా అని కేటీఆర్ మాట్లాడటం ఆయన స్థాయికి తగదు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వం పాలన చేస్తుంది. ఏదైనా స్పీకర్ చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. కోర్టు కూడా చెప్పింది. కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మిత్తిలు కట్టలేని పరిస్థితికి తీసుకువచ్చి.. సిగ్గు లేని పరిపాలన చేశారు. కాబట్టి ఇంటికి పంపించారు. చింత చచ్చినా పులుపు చావడం లేదు. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా చేశారు. నేను కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి తెలంగాణ రావాలని చేరాను. పార్టీ మారితే తప్పు చేసినట్లా.. సందర్భం చూడాలి.." అని మంత్రి జూపల్లి అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.