Minister Konda suresha reacts on Vemulawada temple controversy: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే శంకుస్థాపన చేసింది. పనులు కూడా ప్రారంభించింది. దాదాపు.. రెండెళ్ల వరకు కూడా భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం ఉండదు. అయితే.. పూజాలు, అభిషేకాలు మాత్రం జరుగుతుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
#Vemulawada town Bandh, Rajanna Alaya Parirakshna Samiti members demand, in the name of the temple development not to close, Dharga to be removed from inside the temple compound. @XpressHyderabad @MC_Vemulawada pic.twitter.com/fM0liiGhOD
— Naveen Kumar Tallam (@naveen_TNIE) May 14, 2025
ఈ క్రమంలో రాజన్న ఆలయం డెవ్ లప్ మెంట్ పనుల్ని స్వాగతిస్తునే.. మరోవైపు స్థానిక ప్రజలు, భక్తులు.. రెండెళ్ల పాటు స్వామి వారి దర్శనం కల్పించకుండా ఉండే నిర్ణయంను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. ఇది తమ మనోభావాలకు చెందిన అంశమన్నారు. ఈరోజు వేముల వాడ వ్యాప్తంగా వ్యాపారులు, భక్తులు, స్థానికులు బంద్ ను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేముల వాడలో ఎక్కడికక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందో బస్తు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. వేముల వాడ వివాదంపై తాజాగా...మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. రాజన్న దేవాలయ కమిషనర్, ఈవో ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజన్న ఆలయం విస్తీర్ణం పెంపుపై అపోహాలపై చర్చించారు.
Read more: BSF Jawan Released: ఇండియన్ ఆర్మీ హుంకారానికి తలొగ్గిన పాక్.. బీఎస్ఎఫ్ జవాన్ అప్పగింత..
కేవలం భక్తుల సౌకర్యం కోసమే.. ఆలయం విస్తీర్ణం పెంపును చేపట్టామని దేవాలయ అధికారులు స్పష్టం చేశారు. ఆలయం విస్తీర్ణంపై ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించి, అన్ని వర్గాల ప్రజలతో చర్చించాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter