Minister Seethakka Fires on Bandi Sanjay: "మాది ఇండియా టీం.. కాంగ్రెస్‌ది పాకిస్థాన్ టీం" అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు, యువకులకు జవాబు చెప్పుకోక బండి సంజయ్ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 11 ఏళ్లుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. చెప్పుకోవడానికి అభివృద్ధి లేదని.. సబ్జెక్టు అంతకన్నా లేదన్నారు. అందుకే బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూస్థాన్, పాకిస్థాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట లేదన్నారు. సూటిగా బండి సంజయ్‌ను అడుగుతున్నానని.. పట్టభద్రులకు మీరేం చేశారని నిలదీశారు.
"MLC ఎన్నికల్లో ఓటు అడిగి నైతిక హక్కు బీజేపీకి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు..? ఎంత ఉపాధి కల్పించారు..? ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మారు. ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ.. దేవుడికి వినియోగించే అగర్బత్తిల మీద కూడా GST వేసింది. ఉన్నత విద్య మీద 18 శాతం GST విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతుంది. అలాంటి బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు.
ఎన్నికలప్పుడే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారు. బండి సంజయ్.. పాకిస్థానీతో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దు. పాకిస్థాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప మీరు దేశానికి చేసింది లేదు. దమ్ముంటే అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికల్లోకి రండి. ట్రైబల్ యూనివర్సిటీ పనులు కూడా మొదలు పెట్టలేని అసమర్థ కేంద్ర ప్రభుత్వం మీది. బండి సంజయ్ గారికి చెప్పుకోవడానికి ఏం లేదు.. మాట్లాడడానికి రెండు మాటలు లేవు. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలనుకుంటే.. భారత సరిహద్దుల్లో ఉన్న సైనికుల మాదిరిగా యుద్ధంలో పాల్గొనండి. ఆకలి చావులు అంతర్గత సమస్యలతో దివాలా తీసిన పాకిస్థాన్‌తో పోల్చి దేశాన్ని అవమాన పర్చకండి.
దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్‌ను బీజేపీ పెద్దలు నియంత్రించాలి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన భారతీయులంతా నా సోదరులే అన్న మీరు భారత రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన మీరు.. అధికారం కోసం విద్వేష ప్రసంగాల అవసరమా ..? మీరు చేసింది శూన్యం. పట్టభద్రుల్లారా ఆలోచించండి. విద్యా వేత్త నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి. సంవత్సరకాలంలో 54 వేల ఉద్యోగాలు ఇచ్చాం. నరేందర్ రెడ్డిని గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి. భావోద్వేగాలతో రాజకీయాలు చేసే బండి సంజయ్‌కి, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పండి.
యువతని మత కొట్లాట వైపు మళ్లించి కేసులు నమోదు చేయించడమే బీజేపీ రాజకీయం. బీఆర్ఎస్, బీజేపీ దొందూ దొందే. భారతదేశంలో యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం మానుకోవాలి. ఈ చిల్లర మాటలు మానేయండి. ఇలాంటి విద్వేషాలు పూరిత ప్రసంగాలు భారతీయుల ఐక్యతను దెబ్బతీస్తుంది." అని మంత్రి సీతక్క అన్నారు.
Also Read: MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆశావహులు ఎవరు
Also Read: Prabhas: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. రాజా సాబ్ మూవీ కంటే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









