Secunderabad: రన్నింగ్ ట్రైన్‌లో మరో ఘోరం.. అరగంటపాటు మైనర్ బాలికపై వాష్ రూమ్‌లో అఘాయిత్యం..!

Minor girl molested in running train: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక దుర్మార్గుడు కదులుతున్న ట్రైన్ లో మైనర్ బాలికను వాష్ రూమ్ దగ్గర అరగంట పాటు వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో కూడా తీసుకున్నాడు. దీనిపై సికింద్రా బాద్ పోలీసులు పోక్సో కింద కేసును నమోదు చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 4, 2025, 11:11 AM IST
  • కదులుతున్న ట్రైన్ లో మైనర్ పై అఘాయిత్యం..
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు..
Secunderabad: రన్నింగ్ ట్రైన్‌లో మరో ఘోరం.. అరగంటపాటు మైనర్ బాలికపై వాష్ రూమ్‌లో అఘాయిత్యం..!

Minor girl molested in running train near secunderabad: తెలంగాణలో మహిళలు, అమ్మాయిల భద్రత గాల్లో దీపంలో మారిందని చెప్పుకొవచ్చు. బస్టాండ్, రైల్వేస్టేషన్, మెట్రోలు, ఇలా ప్రతిచోట అమ్మాయిలు వేధింపులకు గురౌతున్నారు. ప్రతిరోజు కూడా అత్యాచారాలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. పోలీసులు ఎంత సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్న, ఎన్ని కఠిన చట్టాల కింద కేసుల్ని నమోదు చేసిన కూడా కామాంధులు మాత్రం తమ వంకర బుద్దిని మార్చుకొవడంలేదు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో ఇటీవల సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఏపీకి చెందిన యువతిపై ఒక కేటుగాడు ఎంఎంటీఎస్ ట్రైన్ లో అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈ ఘటన పెనుదుమాంగా మారింది. దీనిపై అన్ని పార్టీలు సైతం తీవ్రంగా స్పందించాయి. రైల్వే పోలీసులు సైతం.. దీనిపై సీరియస్ అయ్యారు.మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చూస్తామని హమీ సైతం ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఒరిస్సాకు చెందిన ఒక కుటుంబం రక్సెల్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నారు. రాత్రి 2గంటల ప్రాంతంలో మైనర్ బాలిక వాష్ రూమ్ కు వెళ్లింది.అక్కడున్న ఒక కామాంధుడు బాలికను అటకాయించి వాష్ రూమ్ లో బాలికను బంధించి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Read more: Holidays 2025-26: దసరా, సంక్రాంతి సెలవుల జాబితా వచ్చేసింది.. అకాడమిక్ క్యాలెండర్ హాలిడే డేట్స్..

అంతే కాకుండా.. ఈ నీచపు పనుల్ని తన ఫోన్ లో రికార్డు కూడా చేసుకున్నాడు. వెంటనే బాలిక తన వాళ్లకుచెప్పడంతో.. దుర్మార్గుడ్ని.. బాలిక కుటుంబ సభ్యులు, అక్కడున్న వారి సాయంతో పట్టుకున్నారు. వెంటనే ట్రైన్ సికింద్రాబాద్ కు చేరుకొగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధిత తండ్రి.. పలు వీడియోలను జీఆర్పీ పోలీసులకు చూపించాడు. ఈక్రమంలో పోలీసుల కామాంధుడి మీద పోక్సో ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన మరోసారి సికింద్రాబాద్ పరిధిలో సంచలనంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News