Telangana Politics: ఖైరతాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ అడ్డా. ఇక్కడి నుంచే మాజీ మంత్రి పి.జనార్థన్ రెడ్డి అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌కు కంచుకోటలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ గులాబీ జెండానే రెపరెపలాడింది. ఖైరతాబాద్ నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్ గెలిచారు. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల్లో గెలవగానే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో.. ఇద్దరి మధ్య వార్ తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఆశతోనే దానం చేరిక జరిగిందని అంటున్నారు. మంత్రి పదవి విషయంలో పార్టీ హైకమాండ్ నుంచి స్పందన లేకపోవడంతోనే ఎమ్మెల్యే దానం బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేస్తున్నారని టాక్. ఇదే సమయంలో ఆయన చూపు బీఆర్‌ఎస్ వైపు మళ్లిందనే ప్రచారం సాగుతోంది. ఆయన తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతారని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే.. ఎమ్మెల్యే దానం సొంత ప్రభుత్వం పనితీరుపైనే విమర్శలు గుప్పిస్తున్నారట. మరోవైపు దానంపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ విషయమై ఎప్పుడైనా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్‌ఎస్ పార్టీకి ఈ తీర్పు అనుకూలంగా వస్తే మాత్రం ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి. అదే జరిగితే.. దానం పరిస్థితి ఏంటన్నది ప్రశ్నర్థాకంగా మారింది. తిరిగి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగితే.. ఆయనకు విజయారెడ్డి సహకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఓ గ్రూపు ఎమ్మెల్యే వైపు తిరుగుతుంటే.. మరోగ్రూపు కార్పొరేటర్ విజయారెడ్డి నడిపిస్తున్నారు. దాంతో నియోజకవర్గంలో పార్టీ నేతలు ఎవరి వెంట తిరగాలో తెలియక తికమక పడుతున్నారు. మరోవైపు ఖైరతాబాద్‌లో విజయారెడ్డికి చెక్ పెట్టేందుకు దానం తెగ ప్రయత్నిస్తున్నారట. ఆమె కూడా దానం నాగేందర్ తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలిసింది. దానం తిరిగి కారు పార్టీలో చేరితే.. తనకు లైన్ క్లియర్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆధిపత్య పోరును కూల్ చేయడం కాంగ్రెస్ నేతలకు కూడా పెద్ద తలనొప్పిగా మారిందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా ఉంటే ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ ఫైట్‌పై గులాబీ పార్టీ కూడా ఆసక్తిగా గమనిస్తోంది. దానం నాగేందర్‌ను గులాబీ పార్టీలో చేర్చుకోవాలా వద్దా అని బీఆర్‌ఎస్ హైకమాండ్ లెక్కలు వేసుకుంటోందట. ఈ విషయంలో పార్టీ కూడా ఎటు తేల్చుకోలేకపోతుందని సమాచారం. దానం నాగేందర్ బీఆర్ఎస్‌లో చేరితే.. ఓ ఎమ్మెల్యే పెరుగుతారని కొందరు అంటున్నారట. మరికొందరు మాత్రం దానం నాగేందర్‌ను వద్దంటే వద్దని వాదిస్తున్నారట. మొత్తంమీద ఖైరతాబాద్‌లో బై పోల్ జరిగితే మాత్రం దానం నాగేందర్‌కు ఇబ్బందులు తప్పవకపోవచ్చనే చర్చ జరుగుతోంది. మరోవైపు దానంకు విజయారెడ్డి సహకరిస్తారా అనేది కూడా ప్రశ్నర్థకంగా మారింది. దానం నాగేందర్ ఎంట్రీతో గుస్సా మీదున్న విజయారెడ్డి.. ఆయన విషయంలో ఏం చేస్తారనేది మాత్రం త్వరలోనే తేలిపోనుందని పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Also Read: PM Kisan: పీఎం కిసాన్ 19వ విడుత నిధులు పడలేదా? ఫిర్యాదు చేయడం ఎలా? తెలుసుకోండి..
Also Read: Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. 7 శాతం కరువు భత్యం పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









