)
Telangana MLAs Disqualification: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పరిపాలన కంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. మొదట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నా.. ఆ తర్వాత అది సైలెంట్ అయిపోయింది. బీఆర్ఎస్ నుంచి 2/3 వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిపై అనర్హత వేటు ఉండదు. వారిని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలనే ప్లాన్ చేసినా.. కేసీఆర్ ఎత్తుల ముందు రేవంత్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అందులో దానం నాగేందర్ ఏకంగా ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసారు.
ఇక పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కోర్టు కెక్కింది భారత రాష్ట్ర సమతి. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గత కొంత కాలంగా కోర్టులో నానుతుంది. తాజాగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్.
BRS కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దానిపై అడ్వొకేట్ జనరల్‌తో, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించి ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకొన్న తర్వాత స్పీకర్ ఫైనల్ డెసిషన్ తీసుకొనే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.