
Kadiyam Srihari Vs Palla Rajeshwar Reddy: పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలను, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అంటున్నాడని.. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల విషయం కోర్టులో ఉందన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి బీఆర్ఎస్లో చేరారు అని.. ఈ విషయం రాజేశ్వర్ రెడ్డికి తెలియదా..? అని ప్రశ్నించారు. వేరే పార్టీలో గెలుచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కదా అని అడిగారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్.ఎం.ఆర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అని.. మీకు ఒక చట్టం వేరేవాళ్లకు ఒక చట్టమా..? కడియం శ్రీహరి నిలదీశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. డాక్టర్ కడియం కావ్యకి బీ ఫామ్ ఇచ్చి ఎన్నికల ఖర్చుకు నిధులు ఇచ్చామని అంటున్నారని.. ఇది నిజమని నిరూపిస్తే తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తావా అని పల్లా రాజేశ్వర్ రెడ్డికి సవాల్ విసిరారు. దేవునూర్ అటవీ భూములలో ఒక గుంట భూమి కబ్జా చేసినా.. తన రాజకీయ జీవితంలో ఒక ఎకరం బినామీ పేరుతో పట్టా చేయించినట్లు నిరూపిస్తే నీ ఇంట్లో గులాం గిరి చేస్తానని పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే తన ఇంట్లో గులాం గిరి చేయాలన్నారు.
తెలంగాణ చీము నెత్తురు ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని కడియం అన్నారు. తన తల్లీపై పోస్టులు పెడుతున్నారని.. నీకు తల్లి ఉంది కదా..? కన్న తల్లిపై కనీస గౌరవం లేదు వెధవలకి.. అని మండిపడ్డారు. తనపై అనుచిత పోస్టులు పెట్టె ఎవ్వరిని వదిలి పెట్టానని వార్నింగ్ ఇచ్చారు. తాను ఒక్క రూపాయి కాంట్రాక్టు కేసీఆర్ దగ్గర తీసుకున్నానా.. అని నిలదీశారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడదామని.. తన ఎజెండా అంతా అభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజల ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకువాలని చూస్తానని.. హైదరాబాద్‌లో ఉంటూ గెస్ట్‌లాగా వచ్చి పోనని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి