)
Mla palla Rajeshwar reddy Sensational comments on mlc Kavitha suspension: తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ అంశం పెద్ద దుమారంగా మారింది. కవిత .. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి, కీలక నేత హరీష్ రావు, సంతోష్ కుమార్ లపై నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో దీనిపై బీఆర్ఎస్ పార్టీ నిన్న రాత్రి నుంచి కేసీఆర్ నివాసంలో సమాలోచనలు జరిపింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సీబీఐకీ అప్పగిస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. దీనిపై కవిత తీవ్రస్థాయిలో హరిష్ రావు, సంతోష్ కుమార్ లపై మండిపడ్డారు. అసలు వీళ్ల వల్లనే కేసీఆర్ కు ఈ దుస్థితి వచ్చిందన్నారు.
అంతేకాకుండా.. కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నిస్తే.. ఇక పార్టీ ఉంటే ఎంత, పొతే ఎంత అంటూ ఆవేదన వ్యక్తం చేశారు . గతంలో కేసీఆర్ చుట్టు దెయ్యాలు ఉన్నాయన్న కవిత.. ఈసారి ఏకంగా హరీష్ రావు, సంతోష్ కుమార్ లపై మండిపడటం తెలంగాలో రాజకీయాంగా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం హరీష్ రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్విట్ చేసింది. దీన్ని కేటీఆర్ సైతం రీట్వీట్ చేశారు.
దీంతో కవితపై చర్యలు తీసుకొవడం పక్కా అంటూ నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి. అందరు అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ కవితను సస్పెండ్ చేసింది. అయితే..ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ ఎపిసోడ్ పై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను కాంగ్రెస్ పార్టీ వెనుకుండి నడిపిస్తుందన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం.. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే రూమర్స్ పై మాట్లాడారు.ఈ అంశం తమ పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ప్రస్తుతం కవిత .. బీజేపీలో లేదా కాంగ్రెస్ లోకి చేరుతుందని రూమర్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు కవిత తన ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామాకు సిద్దమైపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుందో అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.