MLC Elections: ఫలించిన వ్యూహం..ఉత్తర తెలంగాణలో చక్రం తిప్పిన బండి సంజయ్..

MLC Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు కళ్లెం పడింది. కానీ ఉత్తర తెలంగాణలో 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాల్లో గెలిచింది. తాజాగా జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ సంచలనం రేపింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 4, 2025, 10:36 AM IST
MLC Elections: ఫలించిన వ్యూహం..ఉత్తర తెలంగాణలో చక్రం తిప్పిన బండి సంజయ్..

Telangana MLC Elections:  ఉత్తర తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందుండి రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకున్నారు. తాజాగా జరిగిన  కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మల్క కొమురయ్య కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఉపాధ్యాయులకు  ధన్యవాదాలు చెప్పారు.  మల్క కొమురయ్య ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించడం చాలా గొప్ప విషయమన్నారు. మోడీ మీదున్న నమ్మకమే దేశ వ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలు వేస్తోందని తెలిపారు. కాగా  ఉపాధ్యాయుల సమస్యల కోసం మల్క కొమురయ్య కృషి చేస్తానన్నారు.

Add Zee News as a Preferred Source

అయితే మల్క కొమరయ్య గెలుపు కోసం బండి సంజయ్ చాలా గట్టిగానే కష్టపడ్డారు. కరీంనగర్ లో ఉండి పెద్ద ఎత్తునక్యాంపెయిన్ చేశారు. మల్క కొమరయ్య ఒక విధంగా విజయం సాధించారు అంటే దానిలో బండి సంజయ్ కి సంబంధించిన పోరాటం ఖచ్చితంగా ఉంది. బండి సంజయ్ కరీంనగర్ లోనేక్యాంప్ వేసి మొత్తం ప్రచారాన్ని తన భుజాలపై వేసుకొని మల్క కొమురయ్యను గెలిపించడంలో కీ రూల్ పోషించారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

మల్క కొమరయ్య.. బండి సంజయ్ ఇద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గమే. ముఖ్యంగా  మల్క కొమరయ్య ముఖ్యంగా 317 జీవో వ్యతిరేకంగా గతంలో
రెండు సంవత్సరాల క్రితం బండి సంజయ్ చేసిన ఫైట్ ను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ జీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వీధి పోరాటాలకు దిగారు.
అప్పట్లో ఈ జీవోకు వ్యతిరేకంగా బండి సంజయ్ చేపట్టి దీక్ష చేపడితే.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ని గేట్లు బద్దలు కొట్టి తలుపులును గ్యాస్ కట్టర్స్ తో కట్ చేసి అర్ధరాత్రి పూట సంజయ్ ను అరెస్ట్ చేయించింది. ఇదే విషయాన్ని ఉపాధ్యా ఎన్నికల్లో కొమురయ్య పదే పదే ప్రస్తావించారు.
ఆ ఇంపాక్ట్ ఎన్నికల్లో కనిపించింది. మొత్తంగా బండి సంజయ్ ఫైట్ తో పాటు.. బీజేపీకి సాంప్రదాయంగా వచ్చే ఓట్లు.. నరేంద్ర మోడీ ఇమేజ్ ఇవన్ని మల్క కొమురయ్యకు కలిసొచ్చాయి. మొత్తంగా ఈ గెలుపుతో ఉత్తర తెలంగాణలో బీజేపీ తన పట్టు నిలుపుకున్నట్టైయింది. ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 స్థానాల్లో 7 స్థానాలు ఉత్తర తెలంగాణలో ఉన్నాయి.

మొత్తంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి రెండుకు రెండింట్లో బీజేపీ హవా క్లియర్ గా కనిపిస్తోంది. ఇక్కడ బీసీ వాదం వినిపించినా.. నల్గొండ,
వరంగల్ మాత్రం బీసీ నినాదం పని చేయలేదు. అక్కడ టాప్ త్రీలో ముగ్గురు రెడ్డి అభ్యర్ధులే ఉన్నారు. ఈ రెండు సీట్లు గెలుపుతో ఉత్తర తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భంచవచ్చు. మొత్తంగా తెలంగాన రేవంత్ రెడ్డి సర్కారుకు కౌంట్ డౌన్ మొదలైందనే చెప్పాలి.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News