MLC Jeevan Reddy Vs MLA Sanjay Kumar: తెలంగాణ రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే.. జగిత్యాల రాజకీయాలు మరో ఎత్తు.. గతేడాది నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఎమ్మెల్యే సంజయ్‌గా సాగుతున్న ఫైట్.. ఇంకా చల్లరడం లేదు.. గతేడాది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. అయితే ఆయన రాకను నిరసిస్తూ.. జీవన్‌రెడ్డి రోడ్డెక్కారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేను ఎలా చేర్చుకుంటారంటూ సీఎంపైనే తిరుగుబాటు చేశారు. చివరకు ఢిల్లీ వరకు చేరినా ఆ పంచాయితీని పార్టీ పెద్దలు చల్లార్చారు. కానీ జీవన్ రెడ్డిలో మాత్రం అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. తాజాగా జీవన్ రెడ్డి పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్‌ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
కొద్దిరోజులుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌గా వార్ జరుగుతోంది. అన్ని విషయాల్లో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాస్తా ముందున్నారు. అటు జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఇసుక క్వారీలు లేకపోవడంతో ఇసుక అందుబాటులో లేక ఇబ్బందిగా మారింది. గతంలో రామాలయం వద్ద ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి, నిర్వహణ లోపంతో మూసివేశారు. నిర్మాణ రంగానికి ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణరంగం కుంటుపడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇసుకను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ధర్మ శాల స్థలంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జగిత్యాలలో నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుక స్టాక్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు లేఖ రాసినట్టు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు..
ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పుడు దూకుడు పెంచడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీకాలం ఈ నెలతో ముగుస్తుంది.. ఆయనకు ఎమ్మెల్సీగా కంటిన్యూ చేస్తారని భావించినా.. సాధ్యపడలేదు. ఎమ్మెల్సీ పదవి నుంచి దిగిపోగానే ఆయనకు ఎలాంటి పోస్టు ఉండదు.. అయితే పార్టీ హైకమాండ్ కూడా పదవి విషయంలో జీవన్ రెడ్డికి క్లారిటీ ఇవ్వడం లేదు.. ఆయనకు ఇచ్చేందుకు పదవులు కూడా లేవని పార్టీ నేతలు అంటున్నారు.. ఒకవేళ పదవి ఇవ్వాల్సి వస్తే మాత్రం మరో ఏడాదికి పైగా ఆగాల్సి ఉంటుంది. కానీ ఆయన మాత్రం తనకు పదవి ఖాయమని అనుచరులతో బల్లగుద్ది మరి చెబుతున్నారట. తనకు త్వరలోనే ఓ పెద్ద పదవి రాబోతుందని అనుచరుల దగ్గర చెబుతున్నట్టు తెలిసింది. ఇక్కడే సంజయ్ కూడా తనదైన రాజకీయం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జీవన్ రెడ్డి ఏం చేసిన ఈ నెల రోజులే అని ఎమ్మెల్యే సంజయ్ చెబుతున్నారట. జీవన్ రెడ్డి పదవీ కాలం ముగియగానే జగిత్యాల మొత్తం తమ ఆధీనంలోకి వస్తుందని చెబుతున్నారట. ఇదే విషయాన్ని తనను కలిసిన ప్రతి అనుచరుడితో చెబుతున్నారట. త్వరలోనే తన వెంట నడిచిన నేతలు, కార్యకర్తలకు పదవులు ఇప్పించుకునే బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇస్తున్నారట. అటు ఇసుక వ్యవహారాన్ని కూడా కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తానని అంటున్నారట. దాంతో డాక్టర్ సంజయ్ అనుచరులు కూడా ఖుషీఖుషీ అవుతున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న జీవన్ రెడ్డి మరోసారి దూకుడు పెంచారు. ఎమ్మెల్యే సంజయ్‌ను పరోక్షంగా టార్గెట్ చేశారు. దాంతో మరోసారి ఇద్దరి మధ్య డైలాగ్‌వార్‌మరింత ముదిరే చాన్స్ ఉందని పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారట. ఈ లొల్లి ముదిరిపాకన పడకముందే ఎండ్ కార్డ్ వేయాలని పార్టీ హైకమాండ్‌ను కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది.
Also Read: Gaddar Awards: తెలుగు సినీ పరిశ్రమకు శుభవార్త.. ఏప్రిల్‌లో గద్దర్ అవార్డులు
Also Read: Daughter Raped: కన్న తండ్రే కామాంధుడు.. నొప్పిగా ఉందన్న కొన్ని నెలలుగా అత్యాచారం.. ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









