Mlc Kavitha fires on cm revanth reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తనదైన శైలీలో అపోసిషన్ పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగుస్టేట్స్ లలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక తాజాగా.. కవిత ఏమాత్రం గ్యాప్ దొరికిన కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కారును ఏకీపారేస్తున్నారు. కల్వకుంట్ల కవిత..జగిత్యాల చౌరస్తాలలో వాల్ రైటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ దండు కదిలిరావాలని పిలుపునిచ్చారు.
ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు ఇంటికొక్కరు సైనికులుగా తరలి రావాలని పిలుపుచ్చిన ఎమ్మెల్సీ కవిత పిలుపు నిచ్చారు. అదే విధంగా కాంగ్రెస్ పై తనదైన స్టైల్ లో నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ సర్కారు గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదని సెటైర్ లు వేశారు.
తెలంగాణ ఇస్తానని చెప్పి 2004లో కాంగ్రెస్ మోసం చేసిందని.. ఇప్పుడు మరోసారి అమలుకు సాధ్యంకానీ 420 హమీలతో ప్రజల్ని మోసం చేశారన్నారు. ఉచిత బస్సు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు.
ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి .. మరోవైపు బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడి ప్రజలు కొట్టుకుంటున్నారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సీఎం రేవంత్.. ఉచిత బస్సు ఇచ్చాం కానీ బంగారం మాత్రం ఇవ్వమని రేవంత్ రెడ్డి అంటున్నారని పంచ్ లు వేశారు.కళ్యాణ లక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ మోసం చేశారని కవిత శివాలెత్తిపోయారు.
ఒక బస్సు ఇచ్చి బంగారాన్ని మాత్రం.. తుస్సు చేశారని రేవంత్ సర్కాను ఏకీపారేసింది. రుణ మాఫీ, రైతు భరోసా 50 శాతం మందికి ఇంకా రానేలేదని కవిత ఎద్దేవా చేశారు. అదే విధంగా .. బీజేపీ మోసపూరిత విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత బీఆర్ఎస్ శ్రేణుల్ని పిలుపు నిచ్చారు.
పసుపు బోర్డును తూతూమంత్రంగా ఏర్పాటు చేశారు కానీ చట్టబద్ధత కల్పించలేదన్నారు. అందుకే.. పసుపు బోర్డుకు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి డబ్బులు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారని .. మరి పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా ?.. అని బీజేపీ కూడా మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









